బంగారం ధర 24క్యారట్ల గోల్డ్ పై రూ. 600 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 550 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బంగారం ధర గురించి ఓ వర్గం వారు ఆలోచించడం మానేశారు. మరి కొంతమంది తెలుసుకొని సంతోషపడుతున్నారు. రేట్లు చూసి భయపడుతున్నారు. మరి దారుణంగా తులం లక్ష రూపాయిలంటే మాట్లడతారా మిడిల్ క్లాస్ జనాలు. అయితే మొన్నే బంగారం ధర 24క్యారట్ల గోల్డ్ పై రూ. 600 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 550 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. బుధవారం రోజు బంగారం ధర ప్రస్తుతం రూ.87.15 వద్ద ట్రేడవుతోంది. అయితే ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాల పెంపుతో వాణిజ్య యుధ్ధ భయాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో బంగారంపై పెట్టుబడులకు పెద్దెత్తున మొగ్గుచూపుతున్న క్రమంలో గోల్డ్ రేట్లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.