మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 5జీ పర్పార్మెన్స్, మల్టీ టాస్కింగ్‌ను అందించనుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మార్చి 5న భారత్ మార్కెట్లో వివో T4x 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ధర, ఫీచర్లు, డిజైన్ వివరాలు ముందే కంపెనీ రివీల్ చేసింది. ప్రమోషనల్ పోస్టర్ ఫోన్ ను ప్రంటో పర్పల్ , మెరైన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో డిస్ ప్లే చేస్తుంది. భారీ బ్యాటరీ ,ఏఐ ఫీచర్లు , వివో కు ప్లస్ ...వివో ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా టీజ్ చేసింది. అందులో ఏఐ ఎరేస్ ఏఐ ఫొటో అప్ గ్రేడ్ , ఏఐ డాక్యుమెంట్ మోడ్ వంటివి ఉంటున్నాయి.వివో T4x 5జీ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 5జీ పర్పార్మెన్స్, మల్టీ టాస్కింగ్‌ను అందించనుంది.
ఫ్రంట్ కెమెరా స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడి కాలేదు. కానీ, గత వెర్షన్ వివో T3x 5జీలో కనిపించే 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.భారత మార్కెట్లో వివో టీ4ఎక్స్ 5జీ ఫోన్ ధర కూడా 15 వేలకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. 128GB స్టోరేజ్ ధర రూ.12,499
6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.13,999. 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 15,499.అయితే ఇది మిడిల్ క్లాస్ వారి ఐఫోన్ అని చెప్పచ్చు అంటున్నారు.