ఆదివారం తో పోలిస్తే దాదాపు 100 రూపాయిలు తగ్గింది. ఇక కిలో వెండి ధర రూ. 1,11,900 గా ఉంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రోజురోజుకు పెరుగుతూ పోతున్న బంగారం ధర కాస్త కుదుటపడింది. రెండు రోజులుగా స్వల్పంగా ధరలు తగ్గాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం ఉదయం 24 క్యారట్ల గోల్డ్ ధర రూ. 89,560 కి చేరింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ. 82,100 గా ఉంది. ఆదివారం తో పోలిస్తే దాదాపు 100 రూపాయిలు తగ్గింది. ఇక కిలో వెండి ధర రూ. 1,11,900 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే.. హైదరబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.89,560 లుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.89,560 ఉందని వ్యాపారులు చెబుతున్నారు.