ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వరుసగా తగ్గిన గోల్డ్ రేటు.. ప్రస్తుతం స్వల్పంగా పెరిగింది. దేశీయంగా మాత్రం గోల్డ్ రేటు స్థిరంగానే కొనసాగుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ సిటీల్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో దేశాల్లోను బంగారం ధర కాస్త ఎక్కువగానే ఉంది. గత ఆరు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. అమెరికా డాలర్ పుంజుకోవడంతో గత నాలుగు రోజులుగా గోల్డ్ ధరలు దిగొస్తున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వరుసగా తగ్గిన గోల్డ్ రేటు.. ప్రస్తుతం స్వల్పంగా పెరిగింది. దేశీయంగా మాత్రం గోల్డ్ రేటు స్థిరంగానే కొనసాగుతుంది.
భారతదేశంలో బంగారం ధర తగ్గుతూ వస్తుంది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతుంది. ఇప్పుడు 24 క్యారట్ల బంగారం ధర రూ. 86,770 దగ్గర కొనసాగుతుంది.22 క్యారట్ల బంగారం ధర 79,550 వద్ద కొనసాగుతుంది.దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాలతోపాటు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,620.
అన్ని ప్రధన నగరాల్లోను ఇదే ధర నడుస్తుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 79,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.86,620 వద్ద కొనసాగుతుంది. కాస్త మేకింగ్ ఛార్జీలు ...వంద రెండు వందలు తక్కువగా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,05,000 వద్దకు చేరింది. మునపటి మీద 3 వేల రూపాయిలు తగ్గింది.