రోజు బంగారం తగ్గుతుంది. పెరుగుతుంది. పెరిగేది1000 అయితే తగ్గేది 100 ఆ తగ్గడాన్ని కూడా తగ్గిందని హ్యాపీ గా ఫీలవ్వాలి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బంగారం అని అడగాలంటే ఆడవాళ్లే భయపడే రేట్లు ఉన్నాయి. తులం కొనాలంటే ఇంతకు ముందులా ...పోపుల డబ్బాలో డబ్బులు దాస్తే చాలదు. పెద్ద మొత్తం లో డబ్బు దాచాలి. రేట్లు చూస్తే ఆకాశంలో ఉన్నాయి. జీతాలు చూస్తే అంత అంత మాత్రంగా ఉన్నాయి. ఇంతకు ముందులా కొనేలా లేవు. రోజు బంగారం తగ్గుతుంది. పెరుగుతుంది. పెరిగేది1000 అయితే తగ్గేది 100 ఆ తగ్గడాన్ని కూడా తగ్గిందని హ్యాపీ గా ఫీలవ్వాలి.
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.89,230 ఉండగా, బుధవారం నాటికి రూ.570 తగ్గి రూ.88,660కు చేరుకుంది. మంగళవారం కిలోవెండి ధర రూ. 98,838 ఉండగా బుధవారం నాటికి రూ. 1,646 తగ్గి రూ. 97,192 కు చేరుకుంది.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.88,660గా ఉంది. కిలో వెండి ధర రూ.97,192గా ఉంది.
విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.88,660గా ఉంది. కిలో వెండి ధర రూ.97,192గా ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.88,660గా ఉంది. కిలో వెండి ధర రూ.97,192గా ఉంది.
ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.88,660గా ఉంది. కిలో వెండి ధర రూ.97,192గా ఉంది.