తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి గౌరవం ఉందో మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు తన ఫ్యామిలీ తప్ప మరో విషయంలో వేలు పెట్టరు. అలాంటి ఎన్టీఆర్ ఒక స్టార్ హీరోయిన్ ను ఒక సినిమా షూటింగ్ సందర్భం
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి గౌరవం ఉందో మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు తన ఫ్యామిలీ తప్ప మరో విషయంలో వేలు పెట్టరు. అలాంటి ఎన్టీఆర్ ఒక స్టార్ హీరోయిన్ ను ఒక సినిమా షూటింగ్ సందర్భంలో కించపరిచారట. దీంతో ఆ హీరోయిన్ కాసేపు బాధపడిందట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. సినిమా ఏంటి అనే వివరాలు చూద్దాం.
తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతోంది నయనతార. లక్ష్మీ అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి నయనతార దాదాపు ఇండస్ట్రీలోని స్టార్లందరితో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తమిళ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకొని చివరికి ఇద్దరు పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది.
ప్రస్తుతం సినిమా రంగంలో దూసుకుపోతున్నటువంటి నయనతార ఒకానొక సమయంలో ఎన్టీఆర్ అన్నమాటకు కాస్త బాధ పడిందట.. అయితే జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో ఎన్టీఆర్ నయనతారపై కామెంట్ చేశారట. ఈ విషయాన్ని నయనతార ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.. షూటింగ్ టైం లో నేను మాటిమాటికి టచప్ చేయించుకుంటున్నాను. అలా నేను తరచూ టచ్ అప్ చేయించుకుని లిప్ స్టిక్ రాసుకుంటూ ఉంటే, ఎన్టీఆర్ నా పక్కన నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు.
అలా ఎందుకు అంతలా మేకప్ వేసుకుంటున్నావు అని అడిగితే.. నేను షాట్లో అందంగా కనిపించాలి కదా అని సమాధానం ఇచ్చాను.. దీంతో ఎన్టీఆర్ నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా జనాలు నిన్ను చూడలేరు. నన్ను మాత్రమే చూస్తారు అని అన్నారు.దీంతో నా మొహం కాస్త చిన్నదిగా చేసుకొని బాధపడ్డాను.కానీ ఆయన సరదాగా అన్నారని తెలుసుకొని ఆ తర్వాత ఆయనతో చాలా క్లోజ్ అయిపోయాను అంటూ ఒక ఇంటర్వ్యూలో నయనతార చెప్పుకొచ్చింది.