Maheshbabu:1000మంది చిన్నారుల చిరునవ్వుల్లో కొలువయ్యాడు మహేషుడు.!

మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎంతో గుర్తింపు పొందారు. ఇప్పటికీ ఐదు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ 25ఏళ్ల యువకుడిలా కనిపించడం అతని స్పెషాలిటీ.  అలాంటి మహేష్


Published Aug 09, 2024 11:40:02 AM
postImages/2024-08-09/1723183802_maheshbabu.jpg

న్యూస్ లైన్ డెస్క్: మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎంతో గుర్తింపు పొందారు. ఇప్పటికీ ఐదు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ 25ఏళ్ల యువకుడిలా కనిపించడం అతని స్పెషాలిటీ.  అలాంటి మహేష్ బాబు తన తండ్రి  కృష్ణ నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఎప్పుడైనా సరే డిఫరెంట్ కథలు  ఉన్న స్టోరీల ఎంచుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.  అయితే మహేష్ బాబు సినిమాలంటే చాలా ప్రేమిస్తారు. కేవలం సినిమా షూటింగ్స్, తన ఫ్యామిలీ తప్ప మరో విషయంపై ఆయన దృష్టి పెట్టరు. ఇండస్ట్రీలో వివాద రహితుడిగా  పేరు తెచ్చుకున్నారు.

అలాంటి మహేష్ బాబు  సినిమా కోసమే కాకుండా పేద ప్రజలను ఆదుకునే సహాయ గుణం కూడా ఉంది. ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చేయని విధంగా ఆయన వేలాది మందికి గుండె ఆపరేషన్లు చేయించారు. ఇప్పటి వరకు ఆయన వెయ్యి మందికి పైగా గుండా ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు నిలిపారట. అంతేకాదు ఎంతో మంది నిరుపేద పిల్లలను చదివిస్తూ వారి బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నారట.ఈ  విధంగా ఆయన సినిమా ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్ కాకుండా నిజజీవితంలో కూడా పేద ప్రజలను ఆదుకునే స్టార్ అయ్యారు.

 2021లో 30 మంది పసిపిల్లలకు గుండె సర్జరీలు చేయించి ఆయన సహాయ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.  అప్పటినుంచి ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటిని సెట్ చేయించి వారి ప్రాణాలు నిలిపారు. ఈ మహేష్ బాబు ఏటా  పేద ప్రజలు బాగుకోసం 30 కోట్ల వరకు ఖర్చు చేస్తారట. అలాంటి సహృదయ హీరో మహేష్ బాబు కలకాలం నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది న్యూస్ లైన్ తెలుగు.

newsline-whatsapp-channel
Tags : news-line mahesh-babu birthday murari helping- heart-operation

Related Articles