బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నాలుగు రోజులు గడిచింది. ఇదే తరుణంలో కంటెస్టెంట్ల మధ్య మూడు గొడవలు ఆరు కోట్లాటలు అనే విధంగా తయారయ్యింది. ఎవరికి వారే హైలెట్ అవ్వాలని చెప్పి లేనిపోని గొడవలు సృష్టించుకుంటూ
న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నాలుగు రోజులు గడిచింది. ఇదే తరుణంలో కంటెస్టెంట్ల మధ్య మూడు గొడవలు ఆరు కోట్లాటలు అనే విధంగా తయారయ్యింది. ఎవరికి వారే హైలెట్ అవ్వాలని చెప్పి లేనిపోని గొడవలు సృష్టించుకుంటూ దూసుకుపోతున్నారు. ఎవరికి నచ్చిన విధంగా వారు పర్ఫామెన్స్ చేస్తున్నారు. వారు ఎలాంటి పర్ఫామెన్స్ ఇచ్చిన బయట చూసే జనాలకు వారి క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారనేది క్లియర్ గా గమనిస్తూ ఉంటారు. జనాదరణ పొందిన వారే హౌస్ లో ఉండగలుగుతారు.
ఏ మాత్రం అటు ఇటు అయినా హౌస్ నుంచి ఆడియన్స్ గెంటేయడం ఖాయం. ఏదైనా తెగేదాకా లాగకూడదనేది కూడా హౌస్ లో ఉన్నవారు తప్పనిసరిగా గమనించుకోవాలి. కానీ నాగమణికంఠ మాత్రం తెగేదాకా లాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాగమణికంఠకు నాలుగు ఓట్లు పడ్డాయి. ఈయన నామినేషన్ లో నిలిచారు. దీంతో నాగమణికంట తరచూ బరస్ట్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఫ్యామిలీ గురించి చెబుతూ ఎమోషన్ పండించాలని చూస్తున్నారు. అయితే ఎమోషనల్ గా జనాలు ఒక్కసారి కనెక్ట్ అవుతారు కానీ ప్రతిసారి అదే అంటే కనెక్ట్ అవ్వడం కష్టం.
తాజాగా నాగ మణికంఠ నామినేట్ అయిన తర్వాత హౌస్ లోకి వచ్చి తీవ్రంగా కన్నీరు పెట్టారు. దీంతో నెటిజన్స్ అంతా మెంటలోడా తరచూ ఏడుస్తున్నాడు బయటకు పంపేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు హౌస్ లోకి వచ్చి తాను ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేనన్నట్టు తాను పెట్టుకున్న విగ్గుని కూడా పీకేశాడు. అయ్యో ఇన్నాళ్లు మనికంఠది నిజమైన హెయిర్ స్టైల్ అనుకున్నాం, వీడు విగ్గుతో కూడా మనల్ని మోసం చేశాడు. గేమ్ ఆడుతున్నాడు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
మణికంఠ సింపతి కార్డు కోసం ట్రై చేస్తే అది బెడిసి కొట్టి విమర్శలు పాలు చేస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఈ వారం తర్వాత వచ్చేవారం తప్పనిసరిగా మణికంఠ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మణికంఠ తన గేమ్ ను మార్చుకొని ధైర్యంగా నిలబడి మాట్లాడితే మాత్రం తప్పకుండా హౌస్ లో చాలా రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. మరి చూడాలి మణికంఠ సింపతి కార్డే ప్లే చేస్తారా లేదంటే ధైర్యంగా అందరిని ఎదుర్కొని ముందుకు వెళ్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.