మృనాల్ ఠాకూర్ సీతారారం సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరోయిన్. కేవలం తెలుగులో ఒకే ఒక సినిమా చేసి ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ వరుసగా ఆఫర్లు
న్యూస్ లైన్ డెస్క్: మృనాల్ ఠాకూర్ సీతారారం సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరోయిన్. కేవలం తెలుగులో ఒకే ఒక సినిమా చేసి ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన మానియా చాటుతోంది.. అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు సీరియల్ చేసి "విట్టి దండు" అనే మరాఠి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అలాంటి ఈ ముద్దుగుమ్మ హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చినటువంటి సీతారామం మూవీ ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. భారీ అంచనాలతో అద్భుతమైన లవ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్స్ సాధించింది. ఆ తర్వాత నాని హీరోగా "హాయ్ నాన్న" చిత్రంలో కూడా మరో విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా "ది ఫ్యామిలీ స్టార్" మూవీలో చేసింది కానీ ఈ చిత్రం కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమల వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బాడీ పార్ట్స్ పై తానే కొన్ని కామెంట్స్ చేసింది. నా బాడీలోని అన్ని పార్ట్స్ ల్లో నా తొడలనే చాలామంది చూస్తారని, నా తొడలు చాలా పెద్దగా ఉంటాయని అవి నాకు దేవుడిచ్చిన వరం అని చెప్పుకొచ్చింది. నేను వర్కౌట్ చేస్తున్న టైం లో కూడా చాలామంది నా తొడలనే చూస్తూ ఉండిపోతారని దానివల్లే నేను వర్కౌట్ చేయడం కూడా మానేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె అన్న మాటలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.