బోల్డ్ హీరోయిన్లు మాత్రం మొహమాటం లేకుండా తమ పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అవుతుంటారు. అలాంటివారిలో రెజీనా కాసాండ్రా ఒకరు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పర్సనల్ లైఫ్ విషయాలు సెలబ్రెటీస్ బయటకుచెప్పడం చాలా రేర్ . దానికి కూడా చాలా డేరింగ్ ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్లు తమ రిలేషన్ , లవ్ లాంటి విషయాలు బయటపడినా ..చాలా జాగ్రత్తగా ఉంటారు. కొందరు బోల్డ్ హీరోయిన్లు మాత్రం మొహమాటం లేకుండా తమ పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అవుతుంటారు. అలాంటివారిలో రెజీనా కాసాండ్రా ఒకరు.
తెలుగులో పెద్దగా కనిపించడం లేదు.డాకినీ శాకినీ తర్వాత సినిమాలు పెద్దగా రాలేదు. రెజీనా నటించిన ఉత్సవం చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ప్రమోషన్స్ కు చాలా కష్టపడుతుంది. ఈ ఇంటర్వ్యూలోనే తన పర్సనల్ లైఫ్ ను చెప్పింది రెజీనా.ఒకరకంగా చెప్పాలంటే నేను సీరియల్ డేటర్ ని అని చెప్పొచ్చు.కానీ ప్రస్తుతం రిలేషన్ షిప్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని సింగిల్ గా ఉంటున్నా ..చాలా హ్యాపీగా ఉన్నానంటు నవ్వుతుంది.
సందీప్ కిషన్ తో చాలా సార్లు మ్యారేజ్ రూమర్స్ వచ్చాయి కదా అని రిపోర్టర్ అడగగా.. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాం. పోట్లాడుకుంటాం .. మళ్ళీ కలసిపోతాం అని తెలిపింది. సాయిధరమ్ తేజ్ తో కూడా అలాంటి రూమర్స్ వచ్చాయి. అయితే తేజు చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి ..నా స్పీడ్ భరించలేడు.
మా అమ్మ క్రిస్టియన్, నాన్న ముస్లిం. ఇద్దరూ డివోర్స్ తీసుకున్నారు. నా చిన్న తనంలోనే ఇది జరిగింది. అమ్మ నాన్న కలసి ఉన్నంత వరకు ముస్లిం లాగే పెరిగాను. అమ్మకు నవలలు ఇష్టం. ఆ నవలలో ఓ క్యారక్టర్ కాసాండ్రా ..అందుకే నా పేరు రెజీనా కాసాండ్రా.