AMBANI: కొత్త కోడలు అదృష్టం..ముకేశ్ అంబానీకి 25 వేల కోట్ల లాభం..?

రియలన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వ్యాపారం చేయని రంగం అంటూ లేదు . పక్కా బిజినెస్ మ్యాన్.  ప్రతి అడుగు వ్యాపారమే..అలా కాబట్టి ఇలా ఉన్నారు. దాదాపు 8 నెలల సెలబ్రేషన్స్ తర్వాత అనంత్ అంబానీ , రాధిక మర్చెంట్ పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా....యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోయేలా పెళ్లి చేశారు. 5వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి చుట్టాలు అదే సెలబ్రెటీస్ వచ్చి పెళ్లిని ఎంజాయ్ చేసి వెళ్లారు.


Published Jul 19, 2024 02:14:30 AM
postImages/2024-07-19/1721371892_364589heresanantambaniradhikamerchantsweddingguestlist.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రియలన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వ్యాపారం చేయని రంగం అంటూ లేదు . పక్కా బిజినెస్ మ్యాన్.  ప్రతి అడుగు వ్యాపారమే..అలా కాబట్టి ఇలా ఉన్నారు. దాదాపు 8 నెలల సెలబ్రేషన్స్ తర్వాత అనంత్ అంబానీ , రాధిక మర్చెంట్ పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా....యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోయేలా పెళ్లి చేశారు. 5వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి చుట్టాలు అదే సెలబ్రెటీస్ వచ్చి పెళ్లిని ఎంజాయ్ చేసి వెళ్లారు.


పెళ్లిలో అంత ఖర్చు చేసినా ...ముఖేశ్ అంబానీకి మాత్రం ఏ మాత్రం ఆస్థి తగ్గలేదు. అంతకు ఐదింతలు పెరిగింది. కొత్త కోడలు వచ్చిన వేళ విశేషం ఏమో కానీ.. ఆయన సంపద భారీగా పెరిగింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం పెళ్లి తర్వాత అంబానీ నెట్‌వర్త్‌ రూ.25 వేల కోట్లు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నెట్‌వర్త్‌ 118 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. అదే అనంత్ అంబానీ పెళ్లి జరిగిన రోజు జూలై 12 నాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపోయేలా పెళ్లి చేయడం అది  ఓ రకంగా మంచి బిజినెస్ అని ..అంటున్నారు ఎక్స్ పర్ట్స్.


అంబానీ నెట్‌వర్త్‌ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరు కారణమని కొందరు మార్కెట్ నిపుణులు అభిప్రాయాపడుతున్నారు. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి రోజున, రిలయన్స్ షేర్లు 1 శాతం పెరిగాయి. గత నెలలో షేర్లు 6.65 శాతం పెరిగాయి. గత ఆరు నెలల్లో 14.90 శాతం రాబడిని అందుకున్నారు. ఈ లాభాలన్నీ దాదాపు ముఖేష్ అంబానీ ఆస్థుల్లో 25 వేల కోట్లు పెంచింది. ఇదంతా రాధిక మర్చెంట్ అదృష్టం అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business radhika-marchant mukesh-ambani

Related Articles