RRR: "కొమ్మ ఉయ్యాల" పాటలో చేసిన పాప గుర్తుందా..చూస్తే షాకే.?

ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళి కూడా ఒకరు. ఈయన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో తెలిసేలా చేశారు. అలాంటి రాజమౌళి డైరెక్షన్ లో ఏ నటీనటులు నటించినా వారు అద్భుతమైన పేరు 


Published Sep 10, 2024 12:01:53 PM
postImages/2024-09-10/1725949913_mall.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళి కూడా ఒకరు. ఈయన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో తెలిసేలా చేశారు. అలాంటి రాజమౌళి డైరెక్షన్ లో ఏ నటీనటులు నటించినా వారు అద్భుతమైన పేరు సంపాదించుకుంటారు. ఆ విధంగా ఆయన ఏ సినిమా చేసిన  ఎంతో దృష్టి పెట్టి ప్రతి సీన్ అద్భుతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.  అలాంటి రాజమౌళి డైరెక్షన్ లో వచ్చినటువంటి పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్.

అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల కథను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. అలాంటి ఈ సినిమాలో  ఎన్టీఆర్ పూర్తిగా మల్లి అనే అమ్మాయిని బ్రిటిష్ వారి చెరలో చిక్కుకుంటే తీసుకురావడానికి వెళ్తాడు.  ఆమెను బయటకు తీసుకొచ్చే క్రమంలో కథంతా ఉంటుంది.ఈ విధంగా ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ మూవీ అద్భుతమైన హిట్ సాధించడమే కాకుండా ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది.

ఏకంగా ఈ మూవీ ఆరు అవార్డులను అందుకొని సత్తా చాటింది. ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కీరవాణి సంగీతం ఖండాంతరాలు దాటింది. అలాంటి ఈ చిత్రంలో "కొమ్మ ఉయ్యాల కోన జంపాల" అనే పాట పాడుతూ నటించినటువంటి పాప మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ద్వారా ఆ పాప హైలెట్ అయిందని చెప్పవచ్చు.  ఇంతకీ ఆ పాప పేరు ఏంటయ్యా అంటే ట్వింకిల్ శర్మ.. ఈ పాప ఛత్తీస్ ఘడ్ కు చెందిన  అమ్మాయి. ఈమెకు డాన్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల పలు రియాలిటీ షోలలో పాల్గొని రాజమౌళి కంటపడింది.

అలా త్రిబుల్ ఆర్ సినిమాలో అవకాశమందుకొని  మల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో మల్లి చిన్నపిల్లలానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ మల్లిని చూస్తే మాత్రం మనం షాక్ అయిపోతాం.  సోషల్ మీడియాలో తనకు సంబంధించినటువంటి హాట్ ఫోటోలు అన్నింటిని షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. హీరోయిన్ అందానికి ఏమాత్రం తక్కువ కాదనిపిస్తోంది. ఆ మల్లిని మీరు కూడా చూడండి.

https://www.instagram.com/p/C7cFgX8hdau/?igsh=MXJ4eXFnaGQxc2I1dA==

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ram-charan jr-ntr rajamouli rrr twinkle-sharma

Related Articles