సమంత నాగచైతన్య పేరు వినగానే చాలామందికి గుర్తుకు వచ్చేది వీరి విడాకుల వ్యవహారం మాత్రమే. లవ్ చేసుకొని చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని నాలుగేళ్ల పాటు కాపురం చేసిన వీరు
న్యూస్ లైన్ డెస్క్: సమంత నాగచైతన్య పేరు వినగానే చాలామందికి గుర్తుకు వచ్చేది వీరి విడాకుల వ్యవహారం మాత్రమే. లవ్ చేసుకొని చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని నాలుగేళ్ల పాటు కాపురం చేసిన వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకుంటూ సినిమాలపై దృష్టి పెట్టారు. అలాంటి నాగచైతన్య సమంత నుంచి విడిపోయిన తర్వాత కొన్నేళ్లపాటు ఖాళీగా ఉండి శోభిత ధూళిపాళ్లతో లవ్ లో పడ్డారు. ఇద్దరు కలిసి పలు వెకేషన్స్ వెళ్లి ఎంజాయ్ చేశారు.
చివరికి వీరి లవ్ వ్యవహారాన్ని నిశ్చితార్థం ద్వారా బయటపెట్టేసారు. త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇదంతా ఓవైపు జరుగుతుంటే మరోవైపు సమంత గురించి చాలామంది అభిమానులు ఆలోచన చేస్తున్నారు. వీరి విడాకులకు కారణం నాగచైతన్య అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. సమంత ఏ తప్పు చేయకుండా నాగచైతన్య మనసులో ఒకరిని పెట్టుకుని సమంతను ఇబ్బంది పెట్టి విడాకులు తీసుకున్నారని అన్నారు. ఇదే తరుణంలో సమంతాకు చాలామంది అభిమానులు సపోర్టుగా నిలుస్తున్నారు.
https://www.instagram.com/p/C-faOz7SpKa/
తాజాగా ఒక అభిమాని సమంతాకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. " సమంత మీరు బాధపడవద్దు.. మీకోసం నేనున్నా.. మీరు నేను మంచి జోడి అవుతాం.. ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ.. రెండేళ్ల సమయం ఇస్తే డబ్బులు బాగా సంపాదించి మీ వద్దకు వస్తానని ఇన్స్టాల్ లో పోస్ట్ చేశారు.. దీనిపై సమంత స్పందిస్తూ " బ్యాగ్రౌండ్ లో జిమ్ ఉంది. నేను దాదాపు కన్విన్స్ అయ్యా.. నీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను అనే విధంగా సమంత రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన అభిమాని సంబరపడి పోతున్నారు.