Shobitha:సమంతల నేను చేయను శోభిత ధూళిపాళ్ల..!

సినిమా ఇండస్ట్రీ వాళ్ళు విడాకులు తీసుకొని మళ్ళీ వివాహాలు చేసుకోవడం అనే అంశాన్ని చాలా లైట్ తీసుకుంటారు. సాధారణంగా బయట సమాజంలో ఈ పద్ధతి పాటిస్తే  ఎవరు సహించరు కానీ ఇండస్ట్రీ


Published Aug 23, 2024 03:55:12 PM
postImages/2024-08-23/1724408712_SHOBITHA.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీ వాళ్ళు విడాకులు తీసుకొని మళ్ళీ వివాహాలు చేసుకోవడం అనే అంశాన్ని చాలా లైట్ తీసుకుంటారు. సాధారణంగా బయట సమాజంలో ఈ పద్ధతి పాటిస్తే  ఎవరు సహించరు కానీ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం చాలా అలవోకగా చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఈ పద్ధతి ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఉండేది. మెల్లిమెల్లిగా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా విడాకుల వ్యవహారాలు అనేవి వస్తున్నాయి.

ముఖ్యంగా సమంతా నాగచైతన్య వ్యవహారం అనేది మరింత రచ్చ లేపింది. ఇద్దరూ నటులే  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు కలిసి కాపురం చేశారు. కానీ వీరి మధ్య ఏమైందో ఏమో సడన్ గా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకొని సినిమాలపై దృష్టి పెట్టారు. ఇక ఆ తర్వాత అనారోగ్యం బారిన పడి కాస్త ఇబ్బందులు పడుతోంది ఇక నాగచైతన్య సినిమాలపై దృష్టి పెట్టి హీరోయిన్ శోభిత దూళిపాళ్లను లైన్ లో పెట్టాడు.

చివరికి వీరి ప్రేమ వ్యవహారాన్ని కొన్నాళ్ల నుంచి సీక్రెట్ గా సాగిస్తూ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని విషయాన్ని బయట పెట్టాడు. ఇదే తరుణంలో నాగార్జున కూడా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా అభిమానులతో పంచుకున్నారు. వీరి పెళ్లి వచ్చే ఏడాది మార్చిలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే శోభిత ధూళిపాళ్ల ఒక సంచలనమైన విషయాన్ని చెప్పిందట. టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తాజాగా ఈమెకు రన్వీర్ సింగ్ హీరోగా చేస్తున్న డాన్ 3 చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడం కోసం అవకాశం వచ్చిందట.  దీంతో శోభిత తిరస్కరించిందట. చిత్రంలో ఏవైనా వేరే పాత్రలు ఉంటే నటిస్తా ఐటమ్ సాంగ్ నేను చేయనని  డైరెక్ట్ గా చెప్పేసిందట.

దీనికి ప్రధాన కారణం తనకు కాబోయే భర్త నాగచైతన్య అనుమతి లేకుండా ఇష్టం లేకుండా ఇలాంటి పాత్రలు చేయనని అన్నదట. అక్కినేని లాంటి పెద్ద కుటుంబంలో అడుగుపెడుతున్న, కాబట్టి  వారి కుటుంబానికి తగ్గట్టుగా నేను పాత్రలు ఒప్పుకోవాలని అన్నదట.  సమంతల అలాంటి పనులు చేయనని నా లిమిట్స్ లో నేను ఉంటానని చెప్పుకొచ్చినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత విడిపోయిన తర్వాత "ఉ అంటావా మామ ఊఉ అంటావా మామ" అనే స్పెషల్ సాంగ్ లో చేసిన విషయం అందరికీ తెలిసిందే.

newsline-whatsapp-channel
Tags : nagarjuna samantha engagement nagachaitanya- sobhita-dhulipala

Related Articles