యూట్యూబర్ సిరియాక్ జాన్ సమంత తన హెల్త్ క్లెయిమ్‌లతో “కోట్లాది మందిని మోసం చేస్తోంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ సమంత రుతుప్రభు మయోసైటీస్ తో రెండేళ్లుగా బాధపడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇదంతా ఓ స్మార్ట్ యాక్ట్ అని ఓ యూట్యూబర్ షాకింగ్ కామెంట్లు చేశారు.యూట్యూబర్ సిరియాక్ జాన్ సమంత తన హెల్త్ క్లెయిమ్‌లతో “కోట్లాది మందిని మోసం చేస్తోంది” అని సంచలన పోస్ట్‌లో ఆరోపించాడు. ఈ పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది.
సమంత తన మయోసైటీస్ వ్యాధి క్లెయిమ్‌లను అతిశయోక్తిగా చెప్పి, దాని ఆధారంగా పాడ్‌కాస్ట్‌లు, హెల్త్ ప్రోడక్ట్‌ల ప్రమోషన్ ద్వారా కోట్లాది మందిని మోసం చేస్తోందని ఆరోపించాడు. “సమంత హెల్త్ స్టోరీతో సానుభూతి పొంది, తప్పుడు సమాచారంతో లాభం ఆర్జిస్తోంది” అని సిరియాక్ పేర్కొన్నాడు.
రీసెంట్ గా నిర్మాతగా మారి ‘శుభం’ అనే ప్రాజెక్ట్‌లో భాగమైంది. అయితే ఈ హెల్త్ క్లెయిమ్స్ అన్నీ ఇండస్ట్రీ లో నెట్టుకురావడానికే అంటూ చెప్పుకొచ్చాడు.సమంత అఫీషియల్ గా రియాక్ట్ అవ్వలేదు. ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్ అవుతున్నారు. మయాసైటీస్ చికిత్స కోసం యూఎస్ లో సమంత చాలా రోజులు చికిత్స తీసుకుంది కూడా. ఇది ఫ్యాన్స్ అందరికి తెలుసు కాని సిరియాక్ ఆరోపణలకు సమంత లేదా ఆమె టీమ్ నుంచి స్పష్టత రాకపోవడంతో, నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.