Seeratkapoor:ఆ ఒక్కటి లేకుంటే ఎంత అందమైన డ్రెస్ ధరించిన వేస్ట్.!

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్  వారి టాలెంట్ ను బయట పెట్టుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంటున్నారు. ఇందులో వారికి సంబంధించిన హాట్


Published Aug 13, 2024 02:07:19 AM
postImages/2024-08-13/1723531193_seeratkapoor.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్  వారి టాలెంట్ ను బయట పెట్టుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంటున్నారు. ఇందులో వారికి సంబంధించిన హాట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ  అభిమానుల గుండెల్లో  బుల్లెట్ దింపుతోంది. అలా సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న హీరోయిన్ లలో సీరత్ కపూర్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో శర్వానంద్ హీరోగా వచ్చినటువంటి రన్ రాజా రన్ సినిమాలో కథానాయికగా చేసింది.

 చేసిన మొదటి సినిమాతోనే అద్భుత హిట్ సాధించి తన మానియా కంటిన్యూ చేస్తూ వస్తోంది. ఈమె కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా  సినిమాలు చేస్తూ తనకు సాటిలేరు అనిపించుకుంటుంది. ఈ విధంగా హీరోయిన్ గా ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఓటిటీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు  వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని దూసుకుపోతోంది. ఇక కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సీరత్ కపూర్  చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందమైన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు చెమటలు పట్టిస్తోంది. 

తాజాగా ఈమె తనకు సంబంధించిన  హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కింద ఒక అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చింది. ఎంతటి ఖరీదైన అవుట్ ఫిట్ ధరించిన స్టైలిష్ అవుట్ ఫిట్ లో  మనం కనిపించిన మనలో ఆత్మవిశ్వాసం అనేది లేకుంటే  ఆ ఫోటోలకు అందం ఉండదు అంటూ సీరత్ కపూర్ చెప్పింది. ఈ విధంగా సీరత్ కపూర్  క్యాప్షన్ ఇవ్వడంతో   చాలామంది నెటిజన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. అద్భుతమైన విషయాన్ని చెప్పావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. సీరత్ కపూర్ 2011 రాక్ స్టార్ సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా పని చేసింది. సందీప్ కిషన్ హీరో గా టైగర్  సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది. ఇక ఇవే కాకుండా పలు యాడ్స్ లో బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది.

newsline-whatsapp-channel
Tags : news-line tiger sandeepkishan seeratkapoor run-raja-run sharwanandh

Related Articles