Teja sajja:బర్త్ డే స్పెషల్.. మిరాయ్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాల్లో నటించారు తేజసజ్జ.  ఆ తర్వాత కొన్నాళ్లపాటు చదువులపై దృష్టి పెట్టి పై చదువులు పూర్తి చేశాడు. అలా హీరోగా ట్రై చేస్తున్న


Published Aug 23, 2024 11:55:24 AM
postImages/2024-08-23/1724394324_tejasajja.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాల్లో నటించారు తేజసజ్జ.  ఆ తర్వాత కొన్నాళ్లపాటు చదువులపై దృష్టి పెట్టి పై చదువులు పూర్తి చేశాడు. అలా హీరోగా ట్రై చేస్తున్న  తరుణంలో 2019లో ఓ బేబీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిత్రం అంతగా గుర్తింపు రాలేదు  ఆ తర్వాత తేజ  జాంబిరెడ్డి అనే చిత్రంలో నటించాడు. సినిమా అద్భుతమైన హిట్ సాధించడంతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అద్భుతం అనే చిత్రంలో నటించాడు.

సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో, తర్వాత పాన్ ఇండియా చిత్రం హనుమాన్ లో ఛాన్స్ వచ్చింది. సోషియో ఫాంటసీ బేస్ లో వచ్చిన హనుమాన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన హిట్ సాధించడంతో తేజా సజ్జా పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అలాంటి ఈ హీరో  చేయబోతున్న తదుపరి చిత్రం మీరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచర్ సూపర్ యోధ పాత్రలో తేజ కనిపించబోతున్నారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు తేజ బర్త్ డే సందర్భంగా  పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

https://www.instagram.com/p/C_AAYwuycso/?igsh=MXBsMnRvM3Y5ZTNteA==

ఈ పోస్టర్ లో తేజ మండుతున్న ఇనుపరాడిన పట్టుకుని  తనకు తాను కింద పడిపోకుండా కాపాడుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుని ధైర్యంగా పోరాడుతున్న లుక్ అందులో చూపించారు. అంతేకాదు ఈ పోస్టర్ లో ఒక పురాతనమైన దేవాలయాన్ని కూడా చూపించారు దర్శకుడు.  ఇవన్నీ చూస్తే మాత్రం సినిమా సోషియో ఫాంటసీతో పాటు అద్భుతమైన పోరాటం చేసే హీరోగా తేజ సజ్జను చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఈ సినిమాను ఎనిమిది భాషల్లో 2025 ఏప్రిల్ 18వ తేదీన  విడుదల చేస్తారట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu birthday mirai tejasajja jambi-reddy

Related Articles