మార్కెట్ లో బంగారం , వెండి ఎప్పుడూ డిమాండే . అసలు బంగారం లక్ష అయిపోయినా కొంటారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మార్కెట్ లో బంగారం , వెండి ఎప్పుడూ డిమాండే . అసలు బంగారం లక్ష అయిపోయినా కొంటారు. తులం కొనే వాళ్లు గ్రాము ...గ్రాము కొనే వాళ్లు అరగ్రాము ఇలా ఎంతో కొంత కొంటూనే ఉంటారు.
అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం లో పెట్టుబడులు అన్ని దేశాలు భారీగా పెడుతున్నాయి.
తాజాగా, గోల్డ్ ధర స్వల్పంగా పెరగగా.. సిల్వర్ ధర మాత్రం అలాగే ఉంది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,610, 24 క్యారెట్ల పసిడి ధర రూ.79,210 గా ఉంది. వెండి కిలో ధర రూ.92,400 లుగా ఉంది.
అయితే బంగారం ప్రస్తుతం 24 క్యారట్ల బంగారం గ్రాము ధర 7900 గా 22 క్యారట్ల బంగారం 7200 క్యారట్లు గా నడుస్తుంది. అయితే సిల్వర్ మాత్రం కిలో 92400 గా నడుస్తుంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,610, 24 క్యారెట్ల ధర రూ.79,210 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,610, 24 క్యారెట్ల ధర రూ.79,210 గా ఉంది.దాదాపు గా ఇండియాలో అన్ని పెద్ద పెద్ద సిటీల్లోను ఇదే ధర నడుస్తుంది.