తులం గోల్డ్ రేటు రూ. లక్ష దాటుకొని సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే ఇవాళ బంగారం ధర తగ్గింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధర చాలా రోజులుగా భారీగా పెరుగుతుంది. బంగారం ధర సోమవారం కాస్త శాంతించింది. గత వారంలో బుధవారం నుంచి శనివారం మధ్యలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం పై రూ.4 వేలకు పైగానే పెరిగింది.దీంతో తులం గోల్డ్ రేటు రూ. లక్ష దాటుకొని సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే ఇవాళ బంగారం ధర తగ్గింది.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం ..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం పై రూ. 170 తగ్గగా 22 క్యారట్ల బంగారంపై రూ. 150 తగ్గింది. అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ప్రధాన నగరాలైన హైదరాబాద్ , విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.93,050కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,510కి చేరింది.దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,200 కు చేరగా ..24 క్యారట్ల ధర రూ.1,01,660కు చేరుకుంది.చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,19,900 వద్ద కొనసాగుతుంది.