US: ట్రంప్ హత్య కు డబ్బుఇవ్వలేదని తల్లితండ్రిని కాల్చి చంపిన కొడుకు !


విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసప్‌ అనే కుర్రాడు, ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్‌ మేయర్‌ను తన నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చాడు.


Published Apr 14, 2025 09:44:00 PM
postImages/2025-04-14/1744647321_1744585638242nnmveteenchargedinkillingsandassassinationplot2504131920x10808qa4u4.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అమెరికాలో డబ్బులివ్వలేదని తల్లితండ్రులను దారుణంగా కాల్చి చంపేశాడు .ఆ కేసు దర్యాప్తులో చాలా విషయాలు బయటపెట్టాడు . ఆ కేసు దర్యాప్తులో వెలుగుచూసిన వాస్తవాలు చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఆ కుర్రాడు ప్లాన్  చేశాడు. అందుకోసం డబ్బులు ఇవ్వట్లేదనే పేరెంట్స్ ను చంపేశాడు. అసలు విషయం ఏంటంటే..


విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నికిటా క్యాసప్‌ అనే కుర్రాడు, ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్‌ మేయర్‌ను తన నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చాడు. 14 వేల డాలర్లు నగదు , పాస్ పోర్ట్ తదితర వస్తువులు తీసుకొని ఇంటి నుంచి పరారయ్యాడు. తన తల్లితండ్రులను చంపేస్తే తనకు స్వేఛ్ఛ, ఆర్ధిక అవసరాలు కోసం కూడా తల్లితండ్రిని చంపేసినట్లు తెలిపారు.


వారిని చంపిన తర్వాత ఆ నిందితుడు ఓ డ్రోన్‌, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడని దర్యాప్తులో తెలిపింది. అధ్యక్షుడిని అంతమొందించే ప్లాన్​- ఓ రష్యా వ్యక్తితో కలిసి నిందితుడు వేసినట్లు తెలుస్తోంది.  టిక్ టాక్ ,టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ లలో చాట్ ను బట్టి దర్యాప్తు అధికారులు గుర్తించారు. అధ్యక్షుడిని చంపేసిన తర్వాత ఉక్రెయిన్‌ పారిపోవాలని నిందితుడు ప్లాన్​ వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america donaldtrump

Related Articles