వేణు స్వామి ప్రస్తుతం మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈయన పేరు వినిపిస్తోంది. వేణు స్వామి దంపతులు జర్నలిస్టు మూర్తి నన్ను 5 కోట్లు అడిగారని చెప్పి సోషల్ మీడియా
న్యూస్ లైన్ డెస్క్: వేణు స్వామి ప్రస్తుతం మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈయన పేరు వినిపిస్తోంది. వేణు స్వామి దంపతులు జర్నలిస్టు మూర్తి నన్ను 5 కోట్లు అడిగారని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. మేము ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేమని మాకు ఆత్మహత్య శరణ్యమని వీడియో రిలీజ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉన్నదంతా ఫేక్ అని వారు హైలెట్ అవ్వడం కోసమే ఇలా మూర్తిపై ఆరోపణలు చేశారని జర్నలిస్టు మూర్తి ఆరోపించారు.
అంతే కాదు వేణు స్వామికి సంబంధించినటువంటి పూజలు ఇతర వ్యవహారాల గురించి మొత్తం బయటపెట్టారు. వేణుస్వామి గాయత్రి ప్రజాప్రతి అనే వ్యక్తికి బినామీ అంటూ మీడియా ఎదుట బయటపెట్టారు. ఇదే కాదు వేణుస్వామి పూజలు చేస్తున్న సమయంలో దారుణంగా మాట్లాడతారు, స్త్రీల ప్రైవేట్ పార్ట్స్ పూజలు చేస్తారు అనే విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు. స్వామి ఎక్కువగా కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు కన్నెపిల్లలు సంబంధించిన పూజలు చేస్తారని చెప్పారు.
ఇందులో ముఖ్యంగా యోని పూజలు చేస్తారని, ఆడపిల్లల ప్రైవేట్ పార్ట్స్ పూజల వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఆయన ఆడపిల్లలకు చెబుతారని మూర్తి మీడియా ముందు చెబుతూ ఆయనను, అరెస్టు చేయాలని ఆరోపణ చేశారు. ముఖ్యంగా వేణు స్వామి కామాఖ్య అమ్మవారి పూజలు చేస్తూ మద్యం, మాంసం మందు మాత్రమే ఆమెకు సమర్పిస్తారని, ఈ పూజ సమయంలో వేణు స్వామి కామాఖ్య అమ్మవారికి 40,000 పైగా విలువైనటువంటి మద్యం బాటిల్స్ ముందు పెట్టి పూజలు చేస్తారని అన్నారు. ముఖ్యంగా ఈయన కన్నెపిల్లలను టార్గెట్ చేసి వారి ప్రైవేట్ పార్ట్స్ కు పూజలు చేస్తారని ఆరోపణలు చేశారు.
అంతే కాకుండా పలువురు రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరో, హీరోయిన్లకు సంబంధించిన పూజలు కూడా అనేకం చేశారు. ఈ పూజల్లో కూడా ఆయన ప్రైవేట్ పార్ట్స్ కు సంబంధించిన పూజ గురించి కూడా చెబుతారని అలాంటి పూజలు చేస్తే అన్ని మంచి జరుగుతాయని నమ్మించి ఆయన దగ్గరికి వెళ్లిన ఎంతోమంది ఆడపిల్లలను ఇబ్బందులకు గురి చేశాడని జర్నలిస్టు మూర్తి ఆరోపించారు. ఈ విధంగా వేణుస్వామి గురించి రోజుకో విషయాన్ని బయట పెడుతూ సోషల్ మీడియాలో వివాదంగా మారాడు.