Viral Video: జింక వేసిన ప్లాన్ మామూలుగా లేదు.. షాకైనా, హైనా చిరుత.!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. వాటిని ఎలా సేకరిస్తారో ఏమో కానీ  అవి సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కెర్లు కొడుతుంటాయి.  తాజాగా ఒక అడవిలో జింక,


Published Aug 21, 2024 04:37:19 AM
postImages/2024-08-20/1724134921_tigerdeer.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. వాటిని ఎలా సేకరిస్తారో ఏమో కానీ  అవి సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కెర్లు కొడుతుంటాయి.  తాజాగా ఒక అడవిలో జింక, హైనా చిరుతపులి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటన  అందరినీ ఆకట్టుకుంటుంది.  ఇందులో జింక వేసిన ప్లాన్ ముందు చిరుత, హైనాలు, బిత్తరపోయాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

జింకలకు ఎంత తెలివి ఉంటుందో ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. జింక సమయస్ఫూర్తితో  వేసిన ప్లాన్ తన ప్రాణాలు  కాపాడింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సాధారణంగా అడవుల్లో హైనాలు, సింహం, పులి  ఎక్కువగా జింకలను వేటాడి తింటూ ఉంటాయి.  ఆ విధంగానే ఒక అడవిలో  జింక, చిరుతపులి కంట పడింది. కానీ దానికి తప్పించుకునే పరిస్థితి లేదు.  వెంటనే ఒక ప్లాన్ వేసి అది చనిపోయినట్టు కాసేపు యాక్టింగ్ చేసింది. పులి అటూ ఇటూ కదిపి చూస్తే జింక చనిపోయినట్టే కనిపించింది.  దీంతో పులి వెనుతిరిగి వెళ్ళిపోయింది.

 ఇంతలో వచ్చినటువంటి హైనా కూడా అదే జింక వద్దకు వెళ్లి నోటితో అటు ఇటు కదిపింది  జింక చనిపోయినట్టే ఎటు పడేస్తే అటు పడిపోయింది. ఇక హైనాకు కూడా కొంత దూరం వెళ్లిన తర్వాత జింక టక్కున లేసి  దొరకకుండా పరిగెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక్కడ జింక తెలివిని చూసి చాలామంది  ప్రమాదంలో కూడా సమయస్ఫూర్తి పాటిస్తే బయటపడవచ్చు అని  జింక నిరూపించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి. అయితే ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news tiger deer haina escafe

Related Articles