Vishal: సినిమాల కంటే రాజకీయాలే బెస్ట్

పెద్దగా కష్టపడక్కర్లేదు రాజకీయాల్లోనే బాగుంటుందంటున్నారు. సినిమాలు మానేసి రాజకీయాల్లోకి రావాలని కూడా అనుకుంటున్నారట. 


Published Aug 30, 2024 10:35:00 PM
postImages/2024-08-30/1725037600_193671actorvishal.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కోలీవుడ్ హీరో విశాల్ ఎప్పుడు కాంట్రవర్సీలే. నిన్న మొన్న ..కోర్టు కేసుల్లో నానా గొడవల్లో మీడియాకెక్కిన విశాల్ ఇప్పుడు సినిమాల కంటే రాజకీయాలే బెటర్ అంటున్నారు. పెద్దగా కష్టపడక్కర్లేదు రాజకీయాల్లోనే బాగుంటుందంటున్నారు. సినిమాలు మానేసి రాజకీయాల్లోకి రావాలని కూడా అనుకుంటున్నారట. 


అసలే తమిళ నాట చాలా హీరోలు అల్టిమేట్ గోల్ పవర్ లో ఉండడమే. ఇప్పుడు విశాల్ కూడా ఈ ఆనవాయితీని ఫాలో అవుతున్నారు. విషయం ఏదైనా సరే తాను నిజయతీగా మాట్లాడతానని... తన మాదిరి అందరూ ఉండలేరని చెప్పారు. అంతేనా ..సార్ ప్రజాసేవకు మాత్రమే వస్తున్నారట. సినిమాల్లో కోట్లు వస్తున్నా ...దాని మీద ఆశలేదు ...సాదాసీదాగా పైసా రాని రాజకీయాలే బెటర్ అని చెబుతున్నాడు విశాల్ .


ఓ ఎన్నికల సమయంలో తాను సైకిల్ పై వెళ్లడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయని... హీరో విజయ్ ను తాను కాపీ కొట్టానని చాలామంది అన్నారు. పోలింగ్ బూత్ కు మా ఇళ్లు చాలా దగ్గర అందుకే సైకిల్ లో వెళ్లా..విజయ్ ను తాను ఇమిటేట్ చెయ్యలేదన్నారు. అయినా తన దగ్గర కారు లేదని ...తన పేరెంట్స్ కు మాత్రమే ఉందని తన కారు ఈ మధ్యే అమ్మేసానని తెలిపాడు.చెన్నై రోడ్లకు సైకిల్ కంటే బెటర్ ఆప్షన్ మరొకటి ఉండదని తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu politics movie-news dalapathi-vijay tamilnadu

Related Articles