Sandeep Kishan:నిజాలు తెలుసుకోండి..ఆ ఫోటోలు మా రెస్టారెంట్ వి కావు.!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ  హీరో సందీప్ కిషన్ హోటల్ కు సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి. ఆయన హోటల్ సరైన పద్ధతిలో నడవడం లేదని,  అందులో ఉండే ఆహార పదార్థాలు సరిగా ఉండడం లేదని అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే సందీప్ కిషన్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికారులు నిర్వహించినటువంటి వివాహ భోజనం రెస్టారెంట్ నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతూ వస్తోంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-11/1720669140_sandeep.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ  హీరో సందీప్ కిషన్ హోటల్ కు సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి. ఆయన హోటల్ సరైన పద్ధతిలో నడవడం లేదని,  అందులో ఉండే ఆహార పదార్థాలు సరిగా ఉండడం లేదని అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే సందీప్ కిషన్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికారులు నిర్వహించినటువంటి వివాహ భోజనం రెస్టారెంట్ నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతూ వస్తోంది.

ఇదే తరుణంలో  తేదీ అయిపోయినటువంటి చిట్టి ముత్యాలు రైస్ బ్యాగులు అధికారులు గుర్తించారని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై స్పందించినటువంటి సందీప్ కిషన్ ట్విట్టర్ వేదికగా ఒక లేఖ విడుదల చేశారు. ఏదైనా రాసేముందు తప్పకుండా వాస్తవాలు తెలుసుకోండి అని సూచించారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము రెస్టారెంట్ ను నడిపిస్తున్నాం. కస్టమర్లకు ఎంతో నమ్మకంగా సేవలందిస్తున్నాం.

మా వివాహ భోజనంబు హోటల్ పై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవాలని తెలియజేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మా హోటల్ కిచెన్ కు సంబంధించినవి కావని, వేరే ఫోటోలను జోడించి అలా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే హోటల్ కిచెన్ లో 2022 నాటికి గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగ్  ఉన్న మాట నిజమే కానీ,  దాన్ని ఇప్పటివరకు ఓపెన్ చేయలేదని సందీప్ కిషన్ తెలియజేశారు. ఆ బ్యాగ్ కేవలం వెండర్ శాంపిల్ కోసమే ఉపయోగించే రైస్ బ్యాగ్ అని అన్నారు.

ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ధ్రువీకరణ చేసుకున్నారని, ఈ విధంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదని అన్నారు.  అసలు రెస్టారెంట్ లో ఎలాంటి సమస్యలు చూపించలేదని, చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవాలని అధికారులు చెప్పినట్టు ఆయన తెలియజేశారు.  మా హోటల్ ఫుడ్ క్వాలిటీ విషయంలో కానీ, టేస్ట్ విషయంలో కానీ ఎప్పుడూ కూడా  తగ్గదని అన్నారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయవద్దని హెచ్చరించారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu food-safety sandeep-kishan vivaha-bojanambu-restarent

Related Articles