ఆమని రీసెంట్ గా అందరు ఆశ్చర్యపోయేలా కొత్త సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆంధ్రుల అన్నపూర్ణ అని పిలుచుకునే డొక్కా సీతమ్మ బయోపిక్ లో ఆమని నటిస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఒకప్పటి హీరోయిన్ ఆమని ఇప్పుడు మళ్లీ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రల్లో సినిమాలు , సీరియల్స్ చేస్తూ బిజీగానే ఉంది. రీసెంట్ గా నారి అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చిన ఆమని రీసెంట్ గా అందరు ఆశ్చర్యపోయేలా కొత్త సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆంధ్రుల అన్నపూర్ణ అని పిలుచుకునే డొక్కా సీతమ్మ బయోపిక్ లో ఆమని నటిస్తుంది.
తాజాగా నేడు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. మురళీ మోహన్, ఆమని ముఖ్య పాత్రల్లో ఉషారాణి మూవీస్ బ్యానర్ పై వల్లూరి రాంబాబు నిర్మాణంలో టి.వి.రవి నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా తీస్తున్నారు. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. డొక్కా సీతమ్మలాగా కుర్చీలో కుర్చున్న ఆమని పిక్ ను రిలీజ్ చేశారు.డొక్కా సీతమ్మ గారి చరిత్ర అందరికి తెలియాలని ఈ సినిమా తీస్తున్నాను. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రొడ్యూసర్ గారు విరాళంగా ఇస్తాం. డొక్కాసీతమ్మ పేరు మీద ఉన్న పథకానికి ఆ డబ్బులు విరాళంగా ఇస్తున్నామని తెలిపారు.