abhinaya: తనకు కాబోయే భర్తను రివీల్ చేసిన అభినయ !

తన నిశ్చితార్ధం జరిగినట్లుగా సోషల్ మీడియా వేదికగా అభినయ తెలియజేసింది. అయితే ఆమె తనకు కాబోయే భర్త ముఖాన్ని రివీల్ చెయ్యలేదు.


Published Mar 29, 2025 05:46:00 PM
postImages/2025-03-29/1743251538_1597.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అభినయ అనగానే గుర్తొస్తుంది. చక్కని రూపం ..దీనికి తగ్గట్టే పేరు. ‘ధ్రువ’, ‘శంభో శివ శంభో’,’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటిసినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ద‌గ్గ‌ర అయ్యారు. రీసెంట్ గా పెళ్లి చేసుకోబోతున్నట్లు  పిక్ ను  పోస్ట్ చేసింది. అయితే ఇప్పటి వరకు తమిళ్ హీరో విశాల్ ను చేసుకుంటుందని అనుకున్నారంతా. కాని తన భర్తను రివీల్ చేసుకుంది.  


తన నిశ్చితార్ధం జరిగినట్లుగా సోషల్ మీడియా వేదికగా అభినయ తెలియజేసింది. అయితే ఆమె తనకు కాబోయే భర్త ముఖాన్ని రివీల్ చెయ్యలేదు. అందుకే విశాల్ అని పక్కా ఫిక్స్ అయిపోయారు జనాలు. ఈ రోజు మాత్రం త‌నకు కాబోయే భ‌ర్తతో దిగిన ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. అయితే.. అత‌డి పేరు కార్తీక్‌గా తెలుస్తోంది. అత‌డి సోష‌ల్ మీడియా పేజీలో అత‌డి పేరు స‌న్నీ వ‌ర్మ‌6గా ఉంది. అత‌డు ఎక్క‌డి వాడు, ఏం చేస్తాడు అన్న విష‌యాలు ప్ర‌స్తుతానికి తెలియ‌వు. అత‌డి గురించి నెటిజ‌న్లు సెర్చ్ మొద‌లుపెట్టారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu engagement tamil-actor

Related Articles