Rajendra Prasad: వాడెవ‌డో చంద‌నం దుంగల స్మగ్లర్ హీరోనా ..ఏం కర్మ రా బాబు !

ఒకప్పుడు సినిమాలు చూసి జనాలు ఇన్ స్పైర్ అయ్యేవారు. ఇప్పుడు కాదు ఇప్పుడు హీరో కి అర్ధాలు మారిపోయాయంటూ చెప్పుకొచ్చారు.


Published Dec 10, 2024 04:45:12 AM
postImages/2024-12-10/1733827455_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ రీసెంట్ గా పుష్ప 2 పై షాకింగ్ కమెంట్లు చేశారు. ఆయ‌న న‌టించిన వెబ్ సిరీస్ 'హ‌రిక‌థ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల‌ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఒకప్పుడు సినిమాలు చూసి జనాలు ఇన్ స్పైర్ అయ్యేవారు. ఇప్పుడు కాదు ఇప్పుడు హీరో కి అర్ధాలు మారిపోయాయంటూ చెప్పుకొచ్చారు.


"ఈ క‌లియుగంలో వ‌స్తున్న సినిమాలు, వాటి క‌థ‌లను మీరు చూస్తున్నారు. నిన్న కాక మొన్న చూశాం. వాడెవ‌డో చంద‌నం దుంగ‌ల దొంగ‌... వాడు హీరో. నాకున్న అదృష్టం ఏంటంటే... నేను 48 ఏళ్లుగా స‌మాజంలో మ‌న చుట్టూ ఉన్న‌టువంటి క్యారెక్ట‌ర్స్‌తోనే విలక్షణ హీరో అనిపించుకున్నాను" నా పాత్ర ఎవ్వరిని చెడు దారిలో నడిపించలేదు సంతోషం అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాటలు డైరక్ట్ గా పుష్ప2 అని చెప్పకపోయినా మాట్లాడుతుంది మాత్రం అల్లు అర్జున్ కోసమే అని అర్ధమైందంటున్నారు నెటిజన్లు.


ఇక 'హ‌రిక‌థ' వెబ్ సిరీస్ ఈ నెల 13 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మ్యాగీ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో రాజేంద్ర ప్ర‌సాద్‌తో పాటు హీరో శ్రీరామ్‌, పూజిత పొన్నాడ‌, దివి, అర్జున్ అంబ‌టి, మౌనిక రెడ్డి త‌దిత‌రులు న‌టించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. ఈ సినిమా పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

Related Articles