దొంగ దొంగది మనోజ్ డెబ్యూ మూవీ. మనోజ్ కి జంటగా సదా నటించింది. 2004లో విడుదలైన దొంగ దొంగది పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం కలిగిన మంచు మోహన్ బాబు కుటుంబ కలహాలు రోడెక్కాయి. చిన్నకొడుకుతో భౌతిక కలహాలతో తండ్రి కొడుకులు నువ్వా నేనా అని కత్తులు దూసుకుంటున్నారు. అసలు ఈ గొడవలు ఎందుకో సూచాయిగా అంచానా వేద్దాం.
మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి అకాల మరణం చెందారు. అది కూడా ఆత్మహత్య తన చెల్లెలు తో మోహన్ బాబుకు సంబంధం ఉందనే అనుమానంతో చనిపోయిందని ఓ టాక్ ఉంది. ఎంత నిజమో తెలీదు కాని ఇండస్ట్రీ లో ఇది మాట్లాడుకుంటారు. వీరి సంతానమే మంచు లక్ష్మి, విష్ణు. భార్య దూరమయ్యాక మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నాడు. విద్యాదేవి సొంత చెల్లెలు నిర్మలాదేవితో వివాహమైంది. రెండో భార్య నిర్మలాదేవికి మనోజ్ పుట్టాడు. తేడా లేకుండా ముగ్గురు కలిసి పెరిగారు. సమాన అవకాశాలు కల్పించారు. అయితే ఆరంభం నుండి విష్ణుకు కొంత ఫేవర్ చేశారనే టాక్ ఉంది. ఎంత వరకు నిజమో తెలీదు కాని విష్ణుని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తుందనే విషయం ఇండస్ట్రీ మాట్లాడుకున్నారు.
మోహన్ బాబు తన ఇద్దరు కుమారులను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. పెద్దబ్బాయి విష్ణు 2003లో 'విష్ణు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాని హిట్ రాలేదు . మనోజ్ కూడా హీరో అయ్యాడు ...రీమేక్ దొంగ దొంగది మనోజ్ డెబ్యూ మూవీ. మనోజ్ కి జంటగా సదా నటించింది. 2004లో విడుదలైన దొంగ దొంగది పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.
హీరోలుగా మనోజ్, విష్ణు సక్సెస్ కాలేదు. కనీస మార్కెట్ ఏర్పడలేదు. ఇతర ప్రొడ్యూసర్స్ మంచు హీరోలతో సినిమాలు చేయడం లేదు. మనోజ్ కు కాస్త మార్కెట్ ఉంది. ఎంత వేదం లాంటి డిఫరెంట్ కాన్సప్ట్ తో హిట్టు కొట్టాడు. ఎందుకో మనోజ్ కు సపోర్ట్ రాలేదు. ఆరేళ్ల నుంచి సినిమాలకు దూరం గా ఉన్నాడు మనోజ్ . అదే సమయంలో విష్ణుతో మోహన్ బాబు వరుసగా చిత్రాలు చేస్తున్నారు. మోసగాళ్లు టైటిల్ తో చేసిన క్రైమ్ డ్రామా భారీ బడ్జెట్ మూవీ. ఈ చిత్రానికి కనీస ఆదరణ దక్కలేదు. కోట్లలో నష్టాలు వచ్చాయి. 2022లో జిన్నా టైటిల్ తో మరొక చిత్రం చేశారు. ఆ మూవీ కోటి రూపాయల వసూళ్లు రాబట్టలేదు. కాని విష్ణు పై మోహన్ బాబు పెట్టుబడి పెడుతూనే ఉన్నాడు.
కాని మనోజ్ కు మాత్రం పెట్టుబడి పెట్టడం ఆపేశాడు. అహం బ్రహ్మస్మి మూవీకి సహకారం అందించని మోహన్ బాబు... విష్ణుతో కన్నప్ప మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 100 కోట్లు.ఇది కూడా మనోజ్ తిరగబడడానికి ఒక రీజన్ అవ్వచ్చు. భూమా మౌనికతో ప్రేమ, పెళ్లి వ్యవహారం కూడా మోహన్ బాబు-మనోజ్ మధ్య విబేధాలకు కారణం . ఈ పెళ్ళికి మోహన్ బాబు, విష్ణు మొక్కుబడిగా హాజరయ్యారు.
మనోజ్ వైపు మంచు లక్ష్మి కూడా తేడా వచ్చేసింది. విద్యానికేతన్ బాధ్యతలతో పాటు ఇటు ఇండస్ట్రీ బాధ్యతలు కూడా విష్ణు చేతిలో పడ్డాయి. మనోజ్ కు అది నచ్చడం లేదు. అలాగే ఉమ్మడి ఆస్తి ద్వారా వస్తున్న ఆదాయాన్ని విష్ణు సినిమాలకు పెట్టుబడిగా పెడుతున్నారు. తమకు ఒక్క రూపాయి ప్రయోజనం చేయడం లేదనేది మనోజ్ ఆవేదన అట. ఒకరిపై మరొకరు భౌతిక దాడులకు దిగడం, కేసు పెట్టుకోవడానికి జుల్పల్లి ఫార్మ్ హౌస్ కారణం అట. మోహన్ బాబు ఈ ఆస్తిని మనోజ్ కి ఇచ్చేది లేదని నిశ్చయించుకున్నాడట.