దీని వల్లే స్కిన్ డ్రై అయిపోతుంది. కొందరు దద్దుర్లు, దురదలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని టిప్స్ చూసేద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చలికాలం రాగానే...మాయిశ్చరైజర్ల మీద పడతారు. కొన్ని లోషన్స్ ఎన్ని వాడినా ..చర్మం పొడి బారిపోతుంది. అలాంటి వాళ్లకి ఏం చెయ్యాలో చూసేద్దాం. చలికాలంలో శరీరం డీ హైడ్రేట్ గా మారుతుంది. చల్లగా ఉందని నీళ్లు తాగరు. గాలిలో తేమ కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్లే స్కిన్ డ్రై అయిపోతుంది. కొందరు దద్దుర్లు, దురదలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని టిప్స్ చూసేద్దాం.
* చాలా మంది చర్మం బిరుసుగా, పగినట్లు గా, పొడిగా మారుతుంది. చర్మం తేమను కోల్పోతుంది. చలికాలంలో చాలా మంది శరీరాలు పగిలిపోయేంతగా మారతాయి. మీరు స్నానానికి ముందు కాస్త నువ్వుల నూనె రాసుకొని స్నానం చెయ్యండి.
* నలుగులు శెనగపిండి వాడకండి...రైస్ ఫ్లోర్ కాని వాడకూడదు. చర్మం ఇంకా పొడిగా అవుతుంది.
* షియా బటర్, ఆర్గాన్ ఆయిల్ లేదా కోకో బటర్‌తో కూడిన బాడీ లోషన్‌ను ఉపయోగించండి. లేదా బాడీ వాష్ కూడా ట్రై చెయ్యండి.
* జిడ్డుగల చర్మం కలిగి ఉంటే తేలికపాటి, ఆస్ట్రింజెంట్ బాడీ లోషన్‌ను ఉపయోగించవచ్చు.
* వారానికి ఓ సారి కలబందమట్ట గుజ్జును పెట్టుకొండి. స్కిన్ చాలా సాఫ్ట్ గా అవుతుంది. ట్రై చెయ్యండి