ఈ సినిమాను ఇప్పుడు 4కే డిజిటలైజేషన్ ,5.1 సౌండ్ తో మరింత కలర్ ఫుల్ గా ..టెక్నికల్ రెడీ చేసి రిలీజ్ చేస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం " ఆదిత్య 369" మళ్లీ బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ గా ఉంది. 1991 లో రిలీజ్ అయిన మూవీ భారీ విజయం సాధించింది. ఈ సినిమాను ఇప్పుడు 4కే డిజిటలైజేషన్ ,5.1 సౌండ్ తో మరింత కలర్ ఫుల్ గా ..టెక్నికల్ రెడీ చేసి రిలీజ్ చేస్తున్నారు.
శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ..నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయులుగా , కృష్ణ కుమార్ గా రెండు విభిన్నపాత్రల్లో అధ్భుతంగా నటించిన సినిమా. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు . ఈ సినిమాను తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా చేశారు. ఇప్పటి టెక్నికల్ హంగులతో ఇంకా గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అందించేలా రీ రిలీజ్ చేస్తున్నారు. మంచి థియేటర్లు లభించడంతో ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీన రీరిలీజ్ చేయాలని నిర్ణయించారు.