Adivi Shesh : డెకాయిడ్ గ్లింప్స్ రిలీజ్ ..క్రేజీ లుక్ లో అడవి శేష్ !

హిందీ , తెలుగు బాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రేక్షకులకు ఓ గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతుందని టాక్.


Published May 26, 2025 07:01:38 AM
postImages/2025-05-26/1748258436_1500x900815335dacoitreleasedatebuzz.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ - ఇండియా యాక్షన్ డ్రామా " డెకాయిట్ " ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. షనీల్ డియో డైరక్షన్ లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను సుప్రియా , యార్లగడ్డ నిర్మిస్తుండగా సునీల్ నారంగ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లేను అడవి శేష్ , షనీల్ డియో కలిసి అందించారు. హిందీ , తెలుగు బాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రేక్షకులకు ఓ గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతుందని టాక్.


ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుండగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఓ ఇంటెన్స్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గతంలో రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో అడవిశేష్ దూరంలో ట్రైన్ , కార్ ఫైర్ యాక్సిడెంట్ ను గమనిస్తూ కనిపించిన విధంగానే రీసెంట్ గా గ్లింప్స్ లోనూ మెన్షన్ చేశారు. గ్లింప్స్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కథ , రివీల్ కాకుండా స్మార్ట్ గా కట్ చేశారు. అసలు కథేంటి అంటతే ఇద్దరు మాజీ ప్రేమికుల నేపథ్యంలో నడవనుందని టాక్.తమ లైఫ్ లు మళ్లీ మొదలుపెట్టేందుకు వరుస దోపిడీల ప్రణాళిక వేసుకునేలా కథనం సాగుతుందని తెలుస్తుంది. చివరికి వారి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేదే కథ.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mrunal-thakur adivi-sesh

Related Articles