తన అనుమతి లేకుండా హార్డ్ డ్రైవ్ ను తీసుకెళ్లినట్లు గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కన్నప్పకు షాక్ లు మీద షాకులు తగులుతున్నాయి. డేట్ ఛేంజ్ అయింది..సినిమా పై టాక్ ఏంటి ఈ టెన్షన్స్ తో పాటు మంచు విష్ణుకు మరో షాక్ తగిలింది.కన్నప్ప మూవీకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయమైంది. దీని పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన అనుమతి లేకుండా హార్డ్ డ్రైవ్ ను తీసుకెళ్లినట్లు గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసలు ఏమైందంటే ...ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ పని చేస్తున్నారు. కన్నప్ప చిత్రానికి సంబంధించి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవన్ ను డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిలింనగర్ లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి ముంబై లోని హైవ్ స్టూడియోస్ పింపించింది . ఆ పార్శిల్ ఈ నెల 25 న ఆఫీస్ కు కూడా వచ్చింది. ఈ పార్మిల్ ను ఆఫీస్ బాయ్ రఘు అందుకున్నాడు. అతను దాన్ని చరిత అనే లేడీకి ఇచ్చాడు.
ఇందుకు సంబంధించిన పార్శిల్ ఈ నెల 25న కార్యాలయానికి వచ్చింది. ఈ పార్శిల్‌ను ఆఫీస్ బాయ్ రఘు అందుకున్నాడు. అతడు దాన్ని చరిత అనే మహిళకు ఇచ్చాడు.అయితే.. ఆ హార్డ్ డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి ఆమె తప్పించుకుని తిరుగుతూ ఉంది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. చరిత , రఘులు కావాలనే కొంతమంది ప్రమేయంతో తన ప్రాజెక్ట్ కు నష్టం కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు మూవీ టీం విజయ్ కుమార్ పోలీసులకు కంప్లెయింట్ చేశారు.