Kesari Chapter 2 : ‘కేసరి – చాప్టర్ 2’ ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా !

ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది.జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత ఆ కేసు , ఆకేసుని వాదించిన లాయర్ కథతో ఈ సినిమా మేకింగ్ జరిగింది.


Published May 22, 2025 06:50:00 PM
postImages/2025-05-22/1747920171_16kesari1.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : అక్షయ్ కుమార్ , మాదవన్ ఇద్దరూ ఇద్దరే ప్రత్యేకమైన కథలు...అంతకంటే ప్రత్యేకమైన కథనాల మీద ఫోకస్ చేస్తారు. యాక్టింగ్ తో ఆ కథలను ప్రాణం పోస్తారు .   సరి – చాప్టర్ 2’. ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, లియో మీడియా కలెక్టివ్ బ్యానర్స్ పై కరణ్ జోహార్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా.. పలువురి నిర్మాణంలో కరణ్‌ సింగ్‌ త్యాగి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.  బాలీవుడ్ లో ఏప్రిల్ 18న రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయ్యింది . అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది.జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత ఆ కేసు , ఆకేసుని వాదించిన లాయర్ కథతో ఈ సినిమా మేకింగ్ జరిగింది.


మృత్ సర్ లోని జలియన్ వాలాబాగ్ అనే ప్రదేశంలో 13 ఏప్రిల్ 1919 న సాయంత్రం రౌలత్ యాక్ట్ కి వ్యతిరేకంగా వేలమంది ఇండియన్స్ అక్కడ శాంతియుత నిరసనలు చేస్తుండగా బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ జనరల్ డయ్యర్(సైమన్ పైస్లీ) వారందరి మీద విచక్షణంగా కాల్పులు జరపడంతో అక్కడి వారంతా చనిపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు రాకుండా..అక్కడ టెర్రరిస్ట్ లు ఉన్నారని వాళ్లు కాల్చబోతే మేం తిరిగి కాల్చామని చెప్పుకొచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పంజాబ్ ప్రభుత్వం ఓ కమిషన్ వేయగా అందులో వేశారు. అందులో బ్రిటిష్ వాళ్లు ఒక వైపు ...ఇండియన్ శంకరన్ నాయర్ అనే లాయర్ ఒక వైపు ఉంటారు. ఆ శంకరన్ నాయర్ క్యారక్టర్ అక్షయ్ కుమార్ చేశారు. 


నిజానికి అప్పటి వరకు  బ్రిటిష్ వాళ్ళ కోసం కేసులు వాదించిన శంకరన్ నాయర్ జలియన్ వాలాబాగ్ దురాగతాన్ని తెలుసుకొని చలించిపోతాడు. ఇక భారతదేశ పౌరులకు ఇలాంటి గతి రాకూడదనుకొని ఈ కేసు వాదిస్తాడు. ఈ వార్తని అందరికి చెప్పాలని, న్యాయం చేయాలని ఆ ఉదంతంలో బతికిన ఓ యువకుడు మౌన పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేస్తారు. దీంతో ఇక శంకర్ నాయర్ బ్రిటిష్ వారిని ఎదిరించలేని పరిస్థితిలో ఉండిపోతాడు.దిల్రీత్ గిల్(అనన్య పాండే) లాయర్ వచ్చి మీరే వీళ్ళకు న్యాయం చేయాలి, డయ్యర్ కి శిక్ష పడాలి అని మోటివేట్ చేయడంతో కోర్టులో కేసు వేస్తారు. 


శంకరన్ నాయర్ కి ధీటుగా బ్రిటిష్ వాళ్లకు సపోర్ట్ గా వాదించే లాయర్, శంకరన్ నాయర్ ఫ్రెండ్ నివ్లే మెకిన్లీ(మాధవన్) ని తీసుకొస్తారు.డయ్యర్ ఎలాంటి తప్పు చెయ్యలేదని వాదిస్తారు బ్రిటిష్ వాళ్లు. చివరికి తీర్పు కూడా బ్రిటిష్ వారు ఏం చెయ్యలేదనే తీర్పు ఇస్తారు. ఆ టైంలో శంకరన్ ఏం నిర్ణయం తీసుకున్నారు. డయ్యర్ కు ఏం పనిష్మెంట్ పడిందనేది ఈ మూవీ. జలియన్ వాలాబాద్ ఉందంతం మరోసారి మనకు చూపించారు డైరక్టర్.కేసరి చాప్టర్ 2 లో సిక్కులపై జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి చూపించారు. కేసరి చాప్టర్ 3 కూడా ప్రకటించారు. సినిమా మంచి దేశభక్తిని రేకెత్తించే సినిమా . ట్రస్ట్ మీ మీ డబ్బుకు వర్తీ సినిమా.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bollywood- akshay-kumar

Related Articles