ఈ హ్యాపీ న్యూస్ ను తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన ఫొటోలు , బాబు కాలిని ముద్దాడుతూ కనిపించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. గురువారం తనకు కొడుకు పుట్టినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ హ్యాపీ న్యూస్ ను తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన ఫొటోలు , బాబు కాలిని ముద్దాడుతూ కనిపించారు. చాలా మంది సినీ ప్రముఖులు , అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి రహస్య ను కిరణ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజావారు రాణిగారులో కలిసి నటించారు. తర్వాత వివాహ బంధంతో గత ఏడాది ఒక్కటయ్యారు. క సినిమాతో కిరణ్ అబ్బవరం మంచి సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం కె ర్యాంప్ మూవీలో నటిస్తున్నారు. జైన్స్ నాని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.