mirai: తేజసజ్జా .." మిరాయ్ "మూవీ టీజర్ ....దుమ్ముదులిపేశారు !

రితీకా నాయక్ కథనాయకగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తున్నాడు


Published May 28, 2025 12:40:00 PM
postImages/2025-05-28/1748416391_0.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  " హనుమాన్ " మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హీరో తేజ సజ్జా రీసెంట్ ఫిల్మ్ మిరాయ్ కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సూపర్ యోధా గా తేజ ఈ సినిమాలో కనిపిస్తాడు. రితీకా నాయక్ కథనాయకగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తున్నాడు . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ నిర్మిస్తుంది.


ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, స్పెష‌ల్ గ్లింప్స్‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. రీసెంట్ గా ఈ టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. జ‌ర‌బోయేది మార‌ణ‌హోమం.. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం.. క‌లియుగంలో పుట్టిన ఏ శ‌క్తి దీన్ని ఆప‌లేదు అని జ‌య‌రాం చెప్పిన డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. మంచు మనోజ్ ఇరగదీశాడు. తేజ సజ్జా యాక్టింగ్ అదిరిపోయింది. మొత్తంగా టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాడు. సెప్టెంబర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఈ మూవీలో శ్రీయ, జగపతిబాబు, జయరాం లాంటి చాలా మంది స్టార్లు ఉన్నారు. శ్రీలంకలో చాలా సీన్లు షూట్ చేసినట్లు గా తెలుస్తుంది. మైథలాజికల్ టచ్ ఉన్నట్లు టీజర్ లో తెలుస్తుంది టీజర్ ఆఖ‌రిలో హ‌నుమంతుడు వ‌స్తున్న‌ట్లుగా చూపించారు. 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mirai tejasajja teaser-release

Related Articles