ఆల్రెడీ థియేటర్స్ బంద్ లేదని ఓ రెండు రోజుల ముందే పలువురు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గత కొన్ని రోజులుగా నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్ మధ్య థియేటర్స్ పర్శంటేజ్ విధానం కోసం చర్చలు , వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆల్రెడీ థియేటర్స్ బంద్ లేదని ఓ రెండు రోజుల ముందే పలువురు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. రీసెంట్ నేడు థియేటర్స్ సమస్యలపై ఫిల్మిం ఛాంబర్ లో మీటింగ్ జరిగింది.
థియేటర్ బిజినెస్ లోని అన్ని సెక్టార్లతో నేడు ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ అనంతరం థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా వేసినట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ నెల 30న ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో అన్ని సెక్టార్స్ ని పరిగణనలోకి తీసుకొని ఈ సమస్య పై ఒక కమిటీ వేస్తాము. ఆ కమిటీ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుందని తెలిపింది ఫిలిం ఛాంబర్.