న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన రీసెంట్ సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ నుంచి మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'మాట వినాలి', 'కొల్లగొట్టినాదిరో', 'అసుర హననం' సాంగ్స్ శ్రోతులను ఆకట్టుకున్నాయి.
హీరోయిన్ నిధిఅగర్వాల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'తార తార నా కళ్లు.. వెన్నెల పూత నా ఒళ్లు' అంటూ సాగే ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా... లిప్సిక, ఆదిత్య అయ్యంగార్ ఆలపించారు. ఈ పాటలో నిధి అగర్వాల్ చాలా గ్లామరస్ గా కనిపించింది. ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించనుండగా ఫస్ట్ పార్ట్ 'హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో జూన్ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.అనుపమఖేర్ బాబీ డియోల్ ..తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ డైరక్టర్ చెయ్యగా ..మ్యూజిక్ ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు.