బాలీవుడ్ స్టార్ కపుల్ అయినటువంటి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ లు 2007లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే అలాంటి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత సంవత్సరం నుండి ఓ రూమర్ బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దానికి ప్రధాన కారణం వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరగడమే. యితే ఈ విడాకుల వార్తలపై రీసెంట్గా అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదు అంటూ కొట్టి పారేశారు.అంతేకాదు మా పర్సనల్ లైఫ్ మాకు ఉంటుంది అంటూ విడాకుల వార్తలను ఖండించారు. అయితే తాజాగా అనంత్ అంబానీ పెళ్లి సాక్షిగా వీరిద్దరి డివోర్స్ న్యూస్ మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అనంత్ అంబానీ పెళ్లికి అభిషేక్ బచ్చన్,అమితాబ్ బచ్చన్ అందరూ కలిసి ఫ్యామిలీ గా వస్తే ఐశ్వర్యారాయ్ మాత్రం తన కూతురితో ఒంటరిగా కనిపించింది. దీంతో నిజంగానే వీరి మధ్య దూరం పెరిగిందని, ఇద్దరు విడాకులకు సిద్ధంగా ఉన్నట్టు మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ స్టార్ కపుల్ అయినటువంటి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ లు 2007లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.అయితే పెళ్లికి ముందు వీరికి ఎన్ని ఎఫైర్స్ ఉన్నా కూడా పెళ్లి తర్వాత మాత్రం ఈ జంట చాలా అన్యోన్యంగా ఉన్నారు.వీరి అన్యోన్య జీవితానికి గుర్తుగా ఆరాధ్యా రాయ్ బచ్చన్ అనే అమ్మాయి కూడా పుట్టింది. అయితే అలాంటి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత సంవత్సరం నుండి ఓ రూమర్ బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
దానికి ప్రధాన కారణం వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరగడమే. అయితే ఐశ్వర్యారాయ్ కి అత్తింట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని అందుకే ఇంట్లో నుండి వెళ్లిపోయి వేరు కాపురం పెడదామని అభిషేక్ బచ్చన్ తో గొడవ పడడంతో ఇద్దరి మధ్య గొడవలు పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అభిషేక్ బచ్చన్ తన పెళ్లి ఉంగరం తీసేయడంతో వీరి మధ్య విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే హోలీ పండుగ సమయంలో ఐశ్వర్య కుటుంబంతో కాకుండా వేరుగా హోలీ జరుపుకోవడం వంటి కొన్ని విషయాలు వీరిద్దరి మధ్య విడాకులు నిజమే అనేదానికి ఉదాహరణగా నిలిచాయి.
అయితే ఈ విడాకుల వార్తలపై రీసెంట్గా అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదు అంటూ కొట్టి పారేశారు.అంతేకాదు మా పర్సనల్ లైఫ్ మాకు ఉంటుంది. నాకు నా భార్య అంటే ఎంత ఇష్టమో ఆమెకు తెలుసు. ఆమెకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అంటూ విడాకుల వార్తలను ఖండించారు. అయితే తాజాగా అనంత్ అంబానీ పెళ్లి సాక్షిగా వీరిద్దరి డివోర్స్ న్యూస్ మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే అనంత్ అంబానీ పెళ్లికి అభిషేక్ బచ్చన్,అమితాబ్ బచ్చన్ అందరూ కలిసి ఫ్యామిలీ గా వస్తే ఐశ్వర్యారాయ్ మాత్రం తన కూతురితో ఒంటరిగా కనిపించింది. దీంతో నిజంగానే వీరి మధ్య దూరం పెరిగిందని, ఇద్దరు విడాకులకు సిద్ధంగా ఉన్నట్టు మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే బడా ఫ్యామిలీ కావడంతో ఈ విడాకుల వార్తలు బయటికి రాకుండా కవర్ చేస్తున్నట్టు తెలుస్తోంది