Allu Arjun: అబుదాబి మందిరం లో అల్లు అర్జున్ !

గత ఏడాది ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది.భారతదేశ హిందూ సంస్కృతికి , ఆధ్యాత్మికత , శిల్పకళకు ప్రతీకగా నిలుస్తుంది.


Published Mar 23, 2025 06:24:00 PM
postImages/2025-03-23/1742734668_paK90mAcfoGIiPbhwpqx.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అబుదాబిలో స్వామి నారాయణ్ మందిర్ ను సందర్శించుకున్నారు. ఆలయ నిర్మాణాలను బన్నీ పరిశిలించారు.  మధ్యప్రాచ్యంలోనే స్వామి నారాయ‌ణ్ మందిర్‌ తొలి సాంప్రదాయిక రాతి మందిరం. దీని ప్రారంభోత్సవం గత ఏడాది ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది.భారతదేశ హిందూ సంస్కృతికి , ఆధ్యాత్మికత , శిల్పకళకు ప్రతీకగా నిలుస్తుంది. 


ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో స్వామినారాయణ టెంపుల్స్ ఉన్నాయి. అయితే పలు దేశాల్లో బోచ్‌సన్‌వాసీ అక్షర్ పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు.అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో అది పెద్ద హిట్ అందుకున్నాడు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కలక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు బన్నీ కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీతో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్ . అయితే ఈ మూవీని త్వరలోనే అధికారికంగా ప్రారంభించారు కూడా.


షారుక్ ఖాన్‌తో జ‌వాన్‌ సినిమా తీసి సూప‌ర్ హిట్ అందుకున్న అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ కాంబినేషన్‌లోనూ ఓ సినిమా రావాల్సి ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun dubai

Related Articles