ఆయనకు హార్ట్ కి సంబంధించిన యాంజియోప్లాస్టీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: స్టార్ మ్యూజిక్ డైరక్టర్ , ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ రీసెంట్ గా నేడు ఉదయం చెన్నైలోని అపోలో హాస్పటిల్ లో చేరారు. అయితే ఛెస్ట్ పెయిన్ రావడంతో ఇవాళ ఉదయం ఏ ఆర్ రెహమాన్ ని హాస్పటిల్ లో అడ్మిట్ చేశారు. ఆయనకు హార్ట్ కి సంబంధించిన యాంజియోప్లాస్టీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఏ ఆర్ రహమాన్ కి ఏమైంది, త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నిన్నే రహమాన్ లండన్ నుంచి వచ్చారు. దీని తో హాస్పటిల్ వర్గాలు దీనిపై స్పందించారు. A R రెహమాన్ ఆరోగ్యం బాగానే ఉంది. కార్డియాలజీ విభాగం వైద్యులు చికిత్స అందిసతున్నట్లు తెలిపారు. అయితే ఎలాంటి అందోళన అవసరం లేదని తెలిపారు.
ఇప్పటికే ఆస్కార్ తో సహా ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన ఏ ఆర్ రహమాన్ ఇప్పటికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ చావా లాంటి బ్లాక్ బాస్టర్ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. ఏ ఆర్ రెహమాన్ కొన్ని నెలల క్రితమే తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నారు.