ప్రస్తుతం ఆయన 'డెకాయిట్' అనే చిత్రంతో పాటు 'గూఢచారి-2' చిత్రంలో కూడా నటిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఎలాంటి మూవీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన హీరో అడవి శేష్ . మేజర్ , గూఢచారి , హిట్ లాంటి సినిమాలు చేశారు. శేష్ సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా సెలెక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుతం ఆయన 'డెకాయిట్' అనే చిత్రంతో పాటు 'గూఢచారి-2' చిత్రంలో కూడా నటిస్తున్నారు.
అయితే సినిమాల్లో చాలా వరకు మేకింగ్ అయిపోయిన తర్వాత హీరోయిన్స్ మార్చేస్తున్నాడు. అడవి శేష్ సరసన 'డెకాయిట్' చిత్రంలో శృతిహాసన్‌ను మొదటగా హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఏమైందో షెడ్యూల్ మారి శృతి ప్లేస్ లో మృణాల్ వచ్చేసింది. ఇప్పుడు మృణాల్ కూడా వెళ్లి పోయి వామికా గల్బిని ని సెలక్ట్ చేశారట.
ఈ చిత్రంలో మొదటగా బంటియా సంధూను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. భుజ్ షెడ్యూల్‌లో కూడా చిత్రీకరణ పాల్గొన్న బంటియా స్థానంలో వామికా గబ్బిని సెలెక్ట్ చేశారు. ఇటీవల భుజ్‌లో జరిగిన షెడ్యూల్ తరువాత నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అడవి శేష్ చాలా స్వీట్ అని ఇండస్ట్రీ లో టాక్. కాని ఎందుకు ప్రాజెక్ట్ లో హీరోయిన్స్ మార్చేస్తున్నాడో తెలీదు.
అంతేకాదు అడవి శేష్, వామికా గబ్బితో యూరప్ షెడ్యూల్‌ను కూడా పూర్తిచేశారు మేకర్స్. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ -ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై టి జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళం పాన్-ఇండియన్ చిత్రంగా ఇది విడుదల కానుంది.