దీని ఎఫెక్ట్ తో బంగారం , వెండి లాంటి పెట్టుబడులు కూడా మూడు రోజుల నుంచి స్థిరంగా ఉన్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ మిశ్రమ సంకేతాల ప్రభావంతో ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత సూచీలు కోలుకున్నప్పటి కీ చివరికి స్వల్ప నష్టాల్లోనే ముగిసింది. దీని ఎఫెక్ట్ తో బంగారం , వెండి లాంటి పెట్టుబడులు కూడా మూడు రోజుల నుంచి స్థిరంగా ఉన్నాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టంతో 78,148కి పడిపోయింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 23,688 వద్ద స్థిరపడింది.
టీసీఎస్ (1.97%), రిలయన్స్ (1.92%), ఐటీసీ (1.90%), ఏషియన్ పెయింట్ (1.80%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.83%).
అదానీ పోర్ట్స్ (-1.89%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.75%), ఎల్ అండ్ టీ (-1.26%), సన్ ఫార్మా (-1.19%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.16%). టాప్ లూజర్స్ గా నడుస్తున్నాయి.