జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఈ ,మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ గవర్నమెంట్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవని వెల్లడించింది. విద్యార్ధుల పై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్్ని అనుసరించి ఈ ,మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని కృతికా శుక్లా తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను పెడుతున్నామని దీని వల్ల నీట్ , జేఈఈ వంటి జాతీయ పోటీ పరిక్షలకు ఈజీ అవుతుందని చెప్పారు. సీబీఎస్ఈ విధానంతో ముందుకు సాగుతామని అన్నారు.
సంస్కరణల్లో భాగంగానే ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలను తొలగించామని తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు కాలేజీ లో చూసుకుంటారు. కాని సెకండ్ ఇియర్ మాత్రం ఫైనల్ పరీక్షలు మాత్రం పబ్లిక్ పరీక్షలు అవుతాయి. సంస్కరణలపై ఈ నెల 26 లోగా సలహాలు, సూచనలు పంపవచ్చని తెలిపారు.