ఉద్యోగం చేసే వారికి ఈపీఎఫ్ ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగులు వారి నెలవారి జీతంలో కొంత డబ్బు తమ వయసు అయపోయాక హ్యాపీ లైఫ్ కోసం దాస్తుంటారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఉద్యోగం చేసే వారికి ఈపీఎఫ్ ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగులు వారి నెలవారి జీతంలో కొంత డబ్బు తమ వయసు అయపోయాక హ్యాపీ లైఫ్ కోసం దాస్తుంటారు. సాధారణంగా వారి ప్రాథమిక జీతంలో 12 శాతం + డియర్‌నెస్ అలవెన్స్ వారి EPF ఖాతాలో జమ చేయాలి. అయితే కొత్త జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఈపీఎఫ్‌ను మార్చుకోవాలో చూసేద్దాం.
ముందుగా చాలా జాగ్రత్తగా మీ పేరు ...మీ డీటైల్స్ ను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొండి. తేడా కొడితే వాటితో మీరు తిరగలేరు.
1. ఈపీఎఫ్ ఖాతాకు సైన్ ఇన్ చేయండి. దీనికి UAN మరియు పాస్‌వర్డ్ అవసరం. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
2. ‘ఆన్‌లైన్ సేవలు’ విభాగంలో, ‘ఒక సభ్యుడు – ఒక EPF ఖాతా (బదిలీ అభ్యర్థన)’ ఎంపికను ఎంచుకోండి.
3. వ్యక్తిగత సమాచారం మరియు ప్రస్తుత PF ఖాతా సమాచారాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయండి.
4. మునుపటి ఉద్యోగానికి సంబంధించిన PF ఖాతా డేటాను పొందడానికి ‘వివరాలను పొందండి’పై క్లిక్ చేయండి.
5. యజమానిని ఎంచుకుని, ID లేదా UAN నమోదు చేయండి.
6. మీ ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వండి . ఓటీపీ తో లాగిన్ అవ్వండి.
7. ఆన్‌లైన్ PF బదిలీ అభ్యర్థన ఫారమ్‌ను పొందండి. ఇది ఫిల్ చేసి ...పీడీఎఫ్ లో మీ పాత కంపెనీకి మెయిల్ చెయ్యండి. EPF బదిలీ అభ్యర్థనపై యజమాని ఆన్‌లైన్ నోటిఫికేషన్‌ను కూడా అందుకుంటారు.
8. అప్పుడు యజమాని PF బదిలీ అభ్యర్థనను ఎలక్ట్రానిక్‌గా అంగీకరిస్తాడు. దీనిని మీ పాత కంపెనీ ఎక్సప్ట్ చేసి వారికి ఏ అభ్యంతరం లేదని ఓకే చేస్తుంది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ను గుర్తించడానికి ట్రాకింగ్ ID కూడా పొందబడుతుంది.
ఆధార్ కార్డ్
పాన్ కార్డ్
బ్యాంక్ ఖాతా వివరాలు
మునుపటి యజమాని వివరాలు
పాత మరియు ప్రస్తుత PF ఖాతా వివరాలు ఈ డీటైల్స్ తో మీ పీఎఫ్ ను కొత్త కంపెనీకి లింక్ చేసుకోవచ్చు. వెళ్లాల్సిన కంపెనీ లో ఇలా ఛేంజ్ చేసుకొని మార్చుకోవచ్చు.