ఆమె పిర్యాధుచేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎర్నాకులం పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ సినీ నటి హనీరోజ్ పోలీసులకు కంప్లెయింట్ చేశారు. ఆమె పిర్యాధుచేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎర్నాకులం పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు.
అతను ఓ బిజినెస్ మేన్ (బాబీ చెమ్మనూరు) అని చెప్పింది. గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని... అయితే ఇతర కారణాల వల్ల తాను వెళ్లలేదని... దీంతో తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. కావాలనే తనకు డబుల్ మీనింగ్ డైలాగులు మెసేజ్ చేస్తున్నారని తెలిపింది హనీ. తను వెళ్లే ప్రతి ఈవెంట్ కు వెళ్లడమే కాకుండా ప్రతి ఈవెంట్ లో తనను బ్యాడ్ కామెంట్లు చేస్తూ మాట్లాడుతున్నారని తెలిపారు.
హనీరోజ్ ఫిర్యాదు మేరకు బాబీ చెమ్మనూరును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా హనీరోజ్ స్పందిస్తూ... తనకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ విషయాన్ని తాను ఇప్పటికే సీఎం పినరయి విజయన్ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. మరోసారి ఆడవారిని తక్కువ చేసి మాట్లాడిన లైంగిక వేధింపులకు గురిచేసినా శిక్షలు కఠినంగా ఉండాలని అన్నారు.