హీరో రేసింగ్ కారు సైడ్ వాల్ ను ఢీ కొట్టింది ఈ ఘటనలో అజిత్ కు పెద్ద గాయాలు కాలేదు . స్వల్పగాయాలతో అజిత్ పడ్డారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తమిళ్ స్టార్ హీరో అజిత్ కు ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ లో రేసింగ్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు అదుపు తప్పి సైడ్ వాల్ ను బలంగా ఢీ కొట్టింది. దాదాపు 180 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లిన హీరో రేసింగ్ కారు సైడ్ వాల్ ను ఢీ కొట్టింది ఈ ఘటనలో అజిత్ కు పెద్ద గాయాలు కాలేదు . స్వల్పగాయాలతో అజిత్ పడ్డారు.
అజిత్ కారుకు ప్రమాదం జరిగిందనే వార్త క్షణాల్లోనే వైరల్ అయింది. దీంతో అజిత్ అభిమానుల తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో అజిత్ కు ఎలాంటి గాయాలు కావడంతో అభిమానులు, హీరో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. హీరో అజిత్ కు కార్ రేసింగ్స్ చాలా ఇష్టమనే విషయం అందరికి తెలిసిందే. ఆయనకు పైలట్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి.
రాబోయే రేసింగ్ ఛాంపియన్ షిప్ కు ప్రాక్టీస్ చేస్తున్న టైంలో సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అన్ని జాగ్రత్తలు పాటించడంతో అజిత్ కు గాయాలు కాలేదట. ఇక ఈ ప్రమాదం పై హీరో అజిత్ లేదా ఆయన టీమ్ అధికారికంగా మాత్రం స్పందించలేదు.