మహారాష్ట్రలోని ఉమ్రేడ్-పౌని-కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో జీపుల్లో కొందరు టూరిస్టులు సఫారీ వాహనాల్లో అటవీలోకి వెళ్లారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మనుషులకు అదో సరదా...సంతోషంగా ఉన్నవారిని విచిత్రంగా చూసి ఇబ్బందిపెట్టడం ..అలా చెయ్యకపోతే అవి చాలా హ్యాపీగా బతికేస్తాయిగా. మనిషి బుధ్ధి ఎక్కడికి పోతుంది. ఏదైనా నాశనం చెయ్యడానికి మొదట ఉంటారు. సిటీల్లోనే కాదు అడవిలో జంతువుల్ని కూడా బతకనివ్వడం లేదు. రీసెంట్ గా మహారాష్ట్రలోని ఉమ్రేడ్-పౌని-కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో జీపుల్లో కొందరు టూరిస్టులు సఫారీ వాహనాల్లో అటవీలోకి వెళ్లారు.
సెలవు రోజుల్లో అనుకుంటా ...భారీగా జనాలున్నారు. నాలుగైదు వెహికల్స్ లో గుంపుు గుంపులుగా ఉన్నారు. ఫొటోలు ...వీడియోలు ...చాలా హాడావిడిగా ఉంది. అదే టైంలో ఓ పెద్ద పులి ...ఫ్యామిలీతో ..అలా తిరగడానికి వచ్చింది. పాపం ఆ పులి పిల్లలు చిన్నవి...ముద్దుగా నడుస్తుంటే మన మనుష్య జాతి ఊరుకుంటుందా...చప్పట్లు కొడుతూ ..వీడియోలు తీస్తూ తెగ టెన్షన్ పెట్టేశారు. దీంతో పాపం పులి పిల్లలు కాస్త కంగారు పడ్డాయి ...భయం భయంగా నడుస్తూ వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లిపోయాయి. కాని తల్లి పులి మాత్రం ప్రశాతంగా మనుషులు చేసే సర్కస్ చూస్తుంది. దానికి పిచ్చి లేసి ఎవడో ఒకడి పిక్క పీకేస్తే బాగుండేది..జనాలు సల్లబడేవారు. కాని పాపం ఏం చెయ్యలేదు సైలెంట్ గా ఉంది.
ఈ ఘటన డిసెంబర్ 31న జరిగినట్లు గుర్తించారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. దాంతో.. స్పందించిన జస్టిస్ నితిన్ సంబ్రే, జస్టిస్ వృషాలి జోషి ధర్మాసనం ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటో గా తీసుకొని కేసు నమోదు చేశారు. అయినా అభయారణ్యంలో ఇలాంటి ఈవెంట్స్ వారు ముందే చెబుతారు...సైలెంట్ గా ఉండాలి...పెద్ద చప్పుళ్లు చెయ్యకూడదు అని ...కారణం ఆ సౌండ్ కి అవి భయపడినా అటాక్ చేస్తాయి ...లేదా భయపడిపోతాయని కాని మనవాళ్లు వినరుగా..ఇంతకీ ఈ సుమోటో కేసును జనవరి గురువారం నాటికి వాయిదా వేసింది. ఈ కేసులో ఆ ట్రిప్ లో ఉన్నవారితో పాటు వెహికల్ డ్రైవర్ ఆర్గనైజర్లపై సుమోటో కేసులు నమోదయ్యాయి.