సాధారణంగా అమావాస్య అంటే చాలామంది గ్రామీణ ప్రజలు భయపడుతూ ఉంటారు. కానీ అమావాస్య రోజున కొన్ని పనులు చేస్తే మనకు ఏళ్లుగా పట్టిపీడిస్తున్న సమస్యలన్నీ బయటకు వెళ్లిపోతాయి.
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా అమావాస్య అంటే చాలామంది గ్రామీణ ప్రజలు భయపడుతూ ఉంటారు. కానీ అమావాస్య రోజున కొన్ని పనులు చేస్తే మనకు ఏళ్లుగా పట్టిపీడిస్తున్న సమస్యలన్నీ బయటకు వెళ్లిపోతాయి. అలాంటిది సోమావతి అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే ఆ అష్టైశ్వర్యాలు మన సొంతమవుతాయట. అమావాస్య అనేది హిందూ కాలమానం ప్రకారం చంద్రుడు కనిపించని రోజు. ఈరోజు చంద్రుడు పూర్తిగా కనిపించడు కాబట్టి అమావాస్య అంటారు. అంతేకాదు ప్రతికూల శక్తులకు ఈరోజు బలంగా ఉంటుందని నమ్ముతారు. అలాంటి ఈ సోమవతి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ అమావాస్య రోజున పూర్వీకులకు తలుచుకొని వారికి పూజ చేయడం అత్యంత మంచి ఘట్టమట. దీని ద్వారా పూర్వీకులు ఆశీస్సులు పొందవచ్చట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున చీపురు అస్సలు కొనకూడదట. దీనివల్ల ఎన్నో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారి పోతాయని అంటున్నారు. ఈ రోజున దేవతలకు ఎలాంటి పూజలు చేయరాదట. అమావాస్య రోజున పూజా సామాగ్రి కొత్త వస్తువులు అస్సలు కొనరాదట. ముఖ్యంగా అమావాస్య రోజున పితృదేవతలకు పూజలు చేస్తే వారి ఆశీస్సులు మనపై ఉంటాయట.
దీని ద్వారా ఆనందం కలుగుతుందని, ప్రజలు నమ్ముతారు. అమావాస్య రోజు రావిచెట్టు కింద దీపం వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మనపై ఉండే ప్రతికూలశక్తుల ప్రభావితం తగ్గుతుందట. ఈ రోజున ఆవులకు పండ్లను సమర్పిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లివిరియ్యడమే కాకుండా అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయని పండితులు అంటున్నారు. అంతేకాకుండా అమావాస్య రోజున తిండిలేని వారికి అన్నం పెట్టడం వల్ల కూడా మంచి కలుగుతుందని మన సంపద పెరుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.