AVS: వీళ్లు కమెడియన్ ఏవీఎస్ గారి అల్లుడు , కూతురని తెలుసా ? 2024-06-27 15:53:20

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు 90 'S  కమిడియన్స్( COMEDIANS)  లో ఏవీఎస్( AVS) గారి కామెడీ తెలియని వాళ్లుంటారా...అప్పటి కామెడీ సీన్సే వేరు. ఎన్నిసార్లు చూసినా అసలు బోర్ కొట్టేది కాదు. అందులో ఏవీఎస్( AVS) గారికి చాలా మంచి పేరు. హాస్యనటుడిగా మెప్పించిన ఏవీఎస్ ... రచయితగా.. నిర్మాతగా, దర్శకుడిగా, పాటల రచయితగా అనేక సినిమాలకు వర్క్ చేశారు. అయితే ఏవీఎస్ కూతురు అల్లుడు ..మన ఇండస్ట్రీ లోనే యాక్టర్స్ చాలా క్యారక్టర్స్ చేశారని తెలుసా..


బ్రహ్మానందం( BRAHMANANDAM, ఏవీఎస్( AVS) మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఏవీఎస్.. 2013లో మరణించారు. ఆయన చనిపోయిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి తీరని  లోటు ఆయన కూతురు, అల్లుడు కూడా నటీనటులే. ముఖ్యంగా తెలుగు ఫ్యామిలీ అడియన్స్‏కు పరిచయమైన వాళ్లే. ఏవీఎస్ కూతురు శ్రీ ప్రశాంతి ( SRI PRASANTHI)  ప్రస్తుతం బుల్లితెర యాక్టర్. కొన్ని పదుల సీరియల్స్ చేశారు. ప్రస్తుతం చాలా సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంది. ప్రశాంతికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.


ప్రశాంతి భర్త శ్రీనివాస్ అలియాస్ యాక్టర్ చింటు తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాలు, సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కనిపించారు. చాలా సినిమాలు చేశారు.