Kiara Advani : గుడ్‌న్యూస్ చెప్పిన కియారా ..:ఫుల్ ఖుషీ అయిపోతున్న ఫ్యాన్స్ !

తన ఓడిలోకి ఓ బుజ్జి బేబి రాబోతుందంటూ తెగ సంబరపడింది. చిన్న పిల్లలు వేసుకునే చిట్టి సాక్స్ ను పోస్ట్ చేసి ఈ విషయాన్ని చెప్పింది.


Published Feb 28, 2025 11:12:00 PM
postImages/2025-02-28/1740764655_KiaraSidharth17407323200251740732333483.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  బాలీవుడ్ ముద్దు గుమ్మ కియారా గుడ్ న్యూస్ చెప్పింది. తను ప్రెగ్నెంట్ అంటూ ఓ స్వీట్ పోస్ట్ ను షేర్ చేసుకుంది. తన ఇంట్లోకి ...తన ఓడిలోకి ఓ బుజ్జి బేబి రాబోతుందంటూ తెగ సంబరపడింది. చిన్న పిల్లలు వేసుకునే చిట్టి సాక్స్ ను పోస్ట్ చేసి ఈ విషయాన్ని చెప్పింది.


అతి త్వ‌ర‌లోనే మా జీవితాల్లో గొప్ప బహుమతి రానుంది. అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా, న‌టి కియారా అద్వానీ లు చాలా కాలం ప్రేమించుకున్నారు.  ఈ జంట 2023 ఫిబ్రవరి లో జైపూర్ లో ఓ ప్యాలెస్ లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇటీవ‌లే రెండో వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకున్నారు.


కాగా.. కియారా, సిద్ధార్థ్ ఓ పార్టీలో తొలిసారి క‌లుసుకున్నారు. వీరిద్దరు 2019 నుంచి డేటింగ్ లో ఉన్నట్లు చాలా వార్తలు వచ్చినా 2014 లో ఫగ్లీ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్ిచంది కియారా . త‌న భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి షేర్షా మూవీలో న‌టించింది. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన భ‌ర‌త్ అను నేను, రామ్‌చ‌ర‌ణ్‌తో విన‌య విధ‌య రామ‌, గేమ్ ఛేంజ‌ర్ చిత్రాల్లో న‌టించి తెలుగు వారికి కూడా ద‌గ్గ‌రైంది కియారా. మొత్తానికి గుడ్ న్యూస్ తెలుగు ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీలవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bollywood- pregnant game-changer heroine

Related Articles